గతేడాది ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singh Roy) మూవీతో మంచి సక్సెస్ ను అందుకున్న నేచురల్ స్టార్ నాని.. తదుపరి చిత్రం ‘అంటే సుందరానికీ’లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా మరో అప్డేట్ అందింది.
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Naturalstar Nani) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి రోల్ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటుడు నాని. ఆయన నటించిన శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) గతేడాది ఊహించని ఫలితాలను అందించింది. ఆ ఊపులో నాని మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘అంటే సుందరానికీ’తో ప్రేక్షకుల ముందుుకు రాబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. నజ్రియా నజిమ్ ( Nazriya Nazim) నానీ సరసన ఆడిపాడనుంది. ఈ సినిమాలో సుందర్ ప్రసాద్ గా నానీ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం నాని ఫ్యాన్స్.. తెలుగు ఆడియెన్స్ ఎదురుచూస్తునే ఉన్నారు.
ఈ చిత్రం నుంచి గత నెలలో గ్లింమ్స్ రిలీజ్ చేశారు. నాని బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నాని ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్ అందించారు. రేపు (మార్చి 17) సాయంత్రం 4:00 గంటలకు హీరోయిన్ నజ్రియా ఫహద్ ఫస్ట్ లుక్ పోస్టర్ రానుంది. మేకర్స్ ఈ మేరకు ‘ఇంట్రడ్యూసింగ్ లీలా థామస్’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘హాలో.. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ ప్రేమకు, అభ్యర్థనలకు కట్టుబడి, మేము మా హీరోయిన్ నజ్రియాఫహద్‌ను లీలా థామస్‌గా మార్చి 17న సాయంత్రం 4:05 గంటలకు పరిచయం చేయనున్నాం’ అంటూ పేర్కొన్నారు.
ఇక శ్యామ్ సింగరాయ్ తర్వాత నాని.. తన పూర్తి గెటప్ ను మార్చేసి.. ఫన్ క్యారెక్టర్ లో కనిపించడం మరింత ఆసక్తిగా ఉంది. కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘అంటే సుందరానికీ’లో నాని సుందర్ అనే పాత్ర పోషిస్తున్నారు. కాగా హీరోయిన్ నజ్రియా లీలా థామస్ పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నజ్రియా ఇంట్రడ్యూసింగ్ ఎలా ఉండబోతుందోనంటూ ఎగ్సైట్ అవుతున్నారు.
నాని, నజ్రియా ఫహద్ ఈ చిత్రంలో కథానాయకులుగా నటిస్తున్నారు. నదియా, రాహుల్ రామకృష్ణ, సుహాస్ మరియు హర్షవర్ధన్ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పనులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు నాని, కీర్తి సురేష్ ( Keerthy Suresh) జంటగా ‘దసరా’(Dasara Movie) మూవీ వస్తున్న విజయం తెలిసిందే. ఈ మూవీ ఫూజాకార్యక్రమం కూడా పూర్తయ్యి రెగ్యూలర్ షెడ్యూల్ కూడా మొదలు పెట్టారు.
