కింగ్ నాగార్జున ఫ్యాన్స్ కోసం కొత్త మూవీ అప్డేట్ తో వచ్చేశారు. ది ఘోస్ట్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.


బంగార్రాజు మూవీతో నాగార్జున (Nagarjuna)హిట్ అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ చెప్పుకోదగ్గ వసూళ్లు అందుకుంది. కొడుకు నాగ చైతన్య(Naga Chaitanya)తో ఆయన మల్టీస్టారర్ చేశారు. ఈ విలేజ్ ఫాంటసీ డ్రామా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ఇది సీక్వెల్. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించారు. ఇక బంగార్రాజు సెట్స్ పై ఉండగానే దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో నాగార్జున ది ఘోస్ట్ ప్రకటించారు. 

అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ది ఘోస్ట్ (The Ghost)తెరకెక్కుతుంది. ది ఘోస్ట్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. జులై 9న ఈ వీడియో విడుదల కానుంది. ఈ మేరకు నేడు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. ది కిల్లింగ్ మెషిన్ అంటూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. నిర్మాణం విషయంలో కూడా రాజీ పడకుండా ది ఘోస్ట్ తెరకెక్కిస్తున్నారు. 

Scroll to load tweet…

విదేశాల్లో రిచ్ లొకేషన్స్ లో ది ఘోస్ట్ షూటింగ్ జరిగింది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు సమాచారం అందుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు లో విడుదల చేయాలనేది మేకర్స్ ఆలోచన. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

ది ఘోస్ట్ అనంతరం ప్రవీణ్ సత్తారు హీరో వరుణ్ తేజ్ తో మూవీ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన జరిగింది. మరోవైపు ది ఘోస్ట్ డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఫ్యాన్స్ కి నిరాశే. మంచి ఆఫర్ దక్కితే ది ఘోస్ట్ డిజిటల్ రిలీజ్ చేసే అవకాశం లేకపోలేదు.