Asianet News TeluguAsianet News Telugu

‘టైం ఇవ్వు పిల్ల’ అంటున్న నిఖిల్.. ‘18 పేజెస్’ నుంచి క్రేజీ సాంగ్!

యంగ్ హీరోహీరోయిన్ నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ మరోసారి జంటగా అలరించబోతున్న చిత్రం ‘18 పేజెస్’. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. తాజాగా క్రేజీ యూత్ అంథిమ్ సాంగ్ ను విడుదల చేశారు.
 

Crazy song from Hero Nikhils 18 Pages Movie!
Author
First Published Dec 5, 2022, 7:13 PM IST

‘కార్తీకేయ 2’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు  యంగ్ హీరో నిఖిల్ (Nikhil), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran). మరోసారి జంటగా ‘18 పేజెస్’ చిత్రంతో అలరించేందుకు సిద్ధం అవుతున్నారు.   ఈ నెలలో బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ లో రాబోతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఇటీవలే ఈ చిత్ర టీజర్, ‘నన్నయ్య రాసిన’ అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ తరుణంలో 18 Pages చిత్రం నుండి తమిళ స్టార్ హీరో శింబు పాడిన ‘టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు’ అనే పాటను లిరికల్ వీడియో రూపంలో విడుదల చేశారు. ప్రతీ ఒక్కరి లైఫ్ లో ప్రేమించడం ఎంత కామనో , బ్రేకప్ కూడా అంతే కామన్. అలా బ్రేకప్ అయినా కుర్రాడు పాడే పాటే Time Ivvu Pilla. శ్రీమణి రచించిన ఈ పాటను
తమిళ స్టార్ శింబు  అద్భుతంగా ఆలపించారు. 

"ఈ జనరేషన్ పిల్లగాన్ని కాన నేను
నీలాగా మూవ్ అన్ ఎందుకు అవ్వలేను 
I love you రా బేబీ అంటూ డైలీ నువ్వు
What's app లో చేసిన చాట్ కి నువ్వు వాల్యూ ఇవ్వు
మన పాస్ట్ అసలు గురుతే రాదా 
నీకు కొంచెమైనా గ్లిటే లేదా" లాంటి లిరిక్స్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నన్నయ్య రాసిన లాంటి క్లాస్ మెలోడీ తర్వాత వచ్చిన ఈ క్రేజీ సింగిల్ అంథిమ్ పెద్ద హిట్ అవుతుంది ఆశిస్తున్నారు. మరోవైపు పాటకు కొరియోగ్రఫీ కూడా సరికొత్తగా కనిపిస్తోంది. 

ఇదివరకే ఎన్టీఆర్ బాద్ షా  కి ‘డైమెండ్ గర్ల్’ మంచు మనోజ్ పోటుగాడికి  కి ‘బుజ్జి పిల్ల’ యంగ్ హీరో రామ్ పోతినేని వారియర్ కి ‘బుల్లెట్’ సాంగ్ ను పడిన శింబు ఇప్పుడు నిఖిల్ 18పేజిస్ కోసం ‘టైం ఇవ్వు పిల్ల టైం ఇవ్వు’ అనే పాటను పాడాడు. వాటి మాదిరిగానే ఈ పాట కూడా పెద్ద హిట్ అవ్వబోతుందని అర్ధమవుతుంది. మంచి అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అనౌన్స్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios