Asianet News TeluguAsianet News Telugu

‘వకీల్​ సాబ్’ పై ఇదేం వింత రూమర్?


ప‌వ‌న్ క‌ల్యాణ్ ని తెర‌పై చూసుకుని పండ‌గ చేసుకోవాల‌నుకున్న ప‌వ‌న్ అభిమానులు ఆశ‌ల్ని వ‌కీల్ సాబ్ పూర్తి స్దాయిలో తీర్చేసాడు. కరోనా వచ్చింది కానీలేకపోతే థియోటర్స్ లో కొత్త రికార్డ్ లు క్రియేట్ అయ్యేవి. 

Crazy Rumors on 'Vakeel Saab' movie jsp
Author
Hyderabad, First Published May 5, 2021, 1:36 PM IST

బ‌ల‌మైన క‌థ‌కు స్టార్ కలిస్తే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది. కలెక్షన్స్ రంజుగా ఉంటాయి. `పింక్‌`లో జ‌రిగింది అదే. న్యాయానికి పోతే  అన్యాయంగా కేసులో ఇరికించబడ్డ ఓ ముగ్గురు అమ్మాయి క‌థ అది. వాళ్లని గెలిపించ‌డానికి అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి స్టార్ కావాల్సి వ‌చ్చాడు. అక్క‌డ ఆ క‌థ వ‌ర్క‌వుట్ అయ్యింది. త‌మిళంలో అజిత్ తో తీస్తే.. అక్క‌డా తెగ ఆడేసింది. అలాగే తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తో చేసారు. పవన్ కు ఉన్న ఇమేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ తో రికార్డ్ లే క్రియేట్ చేసింది.  

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని తెర‌పై చూసుకుని పండ‌గ చేసుకోవాల‌నుకున్న ప‌వ‌న్ అభిమానులు ఆశ‌ల్ని వ‌కీల్ సాబ్ పూర్తి స్దాయిలో తీర్చేసాడు. కరోనా వచ్చింది కానీలేకపోతే థియోటర్స్ లో కొత్త రికార్డ్ లు క్రియేట్ అయ్యేవి. ఇప్పుడు  థియేట్రికల్ రన్ పూర్తవడంతో ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యింది.ఈ క్రమంలో ఓటీటీలో ఏప్రిల్ 30న రిలీజ్ చేసారు. అక్కడ  ఈ సినిమాకు రికార్డ్ వ్యూస్ వస్తున్నాయి. మొదటి షో నుంచే ఓటీటి లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియా అంతా ‘వకీల్ సాబ్’ ముచ్చట్లతో నిండిపోతున్నాయి. ఈ నేపధ్యంలో కొత్త కొత్త రూమర్స్ బయిలుదేరుతున్నాయి మీడియాలో. 

తెలుగులో హిట్టైన `వ‌కీల్ సాబ్`ని హిందీలో మరో స్టార్ హీరోతో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందని బోనీ కపూర్ ఆలోచన చేస్తున్నారనేది ఓ రూమర్. అలాగే ఈ సినిమా కి సీక్వెల్ వ‌స్తుంద‌ని మరో రూమర్..మీడియాలో  షికారు చేస్తున్నాయి. అసుల ఈ రెండు వినటానికే వింతగా ఉన్నాయి. హిందీ నుంచి వచ్చి రీమేక్ అయ్యిన సినిమాని మళ్లీ ఎవరైనా హిందీలో రీమేక్ చేస్తారా..అలాగే ఈ సినిమాకు సీక్వెల్ అంటే ఎంత కష్టం. ఈ రెండు జరిగే పనులు మాత్రం కావు. వాస్తవానికి వ‌కీల్ సాబ్ లో సీక్వెల్ చేయ‌ద‌గిన పాయింట్ లేదు. సీక్వెల్ చేసినా.. జ‌నం చూడ‌లేరు.
 
ఇక హిందీ ‘పింక్’ రీమేక్ గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు. ముఖ్యంగా థమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానిలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో మగువ మగువ సాంగ్ మంచి ఆదరణ దక్కించుకుంది.ఈ సినిమాలో అంజలీ, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలో నటించారు. శృతిహాసన్ చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పవన్ స్టైల్ కు ఆయన చెప్పిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పవన్ కు ఈ సినిమా పర్ఫెక్ట్ కంబ్యాక్ అనే చెప్పాలి. ఇక ప్రకాష్ రాజ్ పోషించిన నంద పాత్ర సినిమాకు మరో హైలైట్ అనే చెప్పాలి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios