Asianet News TeluguAsianet News Telugu

జై హనుమాన్ హీరోగా కెజిఎఫ్ యష్? ఇక బాక్సాఫీస్ బద్దలే!

హనుమాన్ మూవీ సంచలన విజయం అందుకోగా దానికి సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీలో హనుమాన్ గా రానా నటిస్తాడంటూ పుకార్లు వచ్చాయి. తాజాగా యష్ పేరు తెరపైకి వచ్చింది. 
 

crazy rumor yash will do hanuman role in prashanth varma jai hanuman ksr
Author
First Published Feb 14, 2024, 9:13 AM IST | Last Updated Feb 14, 2024, 9:13 AM IST


2024 సంక్రాంతి విన్నర్ హనుమాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ సూపర్ హీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసింది. ముఖ్యంగా హనుమాన్ చిత్ర విజువల్స్ అబ్బురపరిచాయి. కేవలం రూ. 50 కోట్ల బడ్జెట్ లో ఇంత క్వాలిటీ విజువల్స్ ఏమిటని జనాలు నోరెళ్లబెట్టారు. భారీ బడ్జెట్ చిత్రాల దర్శకులకు హనుమాన్ రిఫరెన్స్ అని పలువురు కొనియాడారు. 

హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టింది. తేజ సజ్జా వంటి ఒక యంగ్ హీరో చిత్రం ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఊహించని పరిణామం. కేవలం కంటెంట్ ఆధారంగా హనుమాన్ భారీ వసూళ్లు రాబట్టింది. కాగా హనుమాన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. జై హనుమాన్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ సీక్వెల్ లో హనుమాన్ హీరోగా ఉంటాడు. హనుమాన్ పాత్ర ఒక స్టార్ హీరో చేస్తారని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. 

కాగా జై హనుమాన్ లో నటించే హీరో రానా అంటూ ప్రచారం జరిగింది. హనుమాన్ లో ఫేస్ సరిగా రివీల్ చేయకపోయినప్పటికీ హనుమాన్ పాత్ర చేసింది రానా అని కథనాలు వెలువడ్డాయి. దీంతో జై హనుమాన్ హీరో రానా అని జనాలు ఫిక్స్ అయ్యారు. అయితే ఈ ప్రాజెక్ట్ హీరోగా యష్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న యష్ కరెక్ట్ అనుకుంటున్నారట. 

జై హనుమాన్ భారీ బడ్జెట్ మూవీ కావడంతో యష్ ని లైన్లోకి తెస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. టాలీవుడ్ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. మరి అదే జరిగితే బాక్సాఫీస్ బద్దలే అనడంలో సందేహం లేదు. జై హనుమాన్ 2025లో విడుదల చేస్తానని ప్రశాంత్ వర్మ అన్నాడు. యష్ వంటి హీరోతో ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయడం జరగని పని. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios