బిగ్ బాస్ షో హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఫేట్ మార్చేసిందని చెప్పాలి. ఆమె అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై ఆఫర్స్ తో బిజీ అయ్యారు.  మోనాల్ హౌస్ నుండి బయటికి వచ్చిన తరువాత విడుదలైన హిందీ చిత్రం కాగజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లుడు అదుర్స్ చిత్రంలో ఐటెం సాంగ్ చేసి మంచి రెమ్యూనరేషన్ అందుకున్నారు. హిందీలో కూడా మోనాల్ కి అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు స్టార్ మాలో ఇటీవల ప్రారంభమైన డాన్స్ ప్లస్ రియాలిటీ షోకి జడ్జిగా మోనాల్ వ్యహరిస్తున్నారు. 

కాగా మోనాల్ మరో బంపర్ ఛాన్స్ అందుకుందంటూ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఆమె ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో కలిసి స్టెప్స్ వేయనున్నారట. మహేష్ దర్శకుడు పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నారు. ఇటీవలే దుబాయ్ లో సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. మహేష్ మరియు హీరోయిన్ కీర్తి సురేష్ పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. 

కాగా ఈ మూవీలో ఓ మాస్ ఐటెం సాంగ్ కోసం మోనాల్ గజ్జర్ సంప్రదించారట. మహేష్ అనే సరికి మోనాల్ సైతం వెంటనే పచ్చ జెండా ఊపారని సమాచారం. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, టాలీవుడ్ లో ప్రముఖంగా ప్రచారం అవుతుంది. మహేష్ గత చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీలో తమన్నా మహేష్ తో స్పెషల్ సాంగ్ చేశారు. సర్కారు వారి పాటలో ఆ అవకాశం మోనాల్ దక్కించుకుందని అందరూ అంటున్నారు. మరి ఇదే నిజమైతే మోనాల్ కి భారీ ఆఫర్ దక్కినట్లే.