యంగ్ హీరోలకు ధీటుగా మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలు చేస్తున్నారు. ఓ మూవీ సెట్స్ పై ఉండగానే రెండు మూడు చిత్రాలు లైన్ లో పెడుతున్నాడు. యువ దర్శకులు బాబీ, మెహర్ రమేష్, సుజీత్ లతో చిరంజీవి చిత్రాలు చేస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది. చిరంజీవి సైతం స్వయంగా ఈ ప్రాజెక్ట్స్ పై స్పష్టత ఇచ్చారు. మెహర్ రమేష్ తో చిరంజీవి అజిత్ నటించిన తమిళ్ చిత్రం వేదాళం రీమేక్ చేస్తున్నారని సమాచారం.

 
కాగా మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన లూసిఫర్ పొలిటికల్ డ్రామా కాగా తెలుగులో మోహన్ రాజా దర్శకుడిగా వ్యవహరించనున్నారు. కాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ బజ్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. లూసిఫర్ రీమేక్ లో ఓ కీలక రోల్ వరుణ్ తేజ్ చేస్తున్నారట. కథలో కీలకమైన పాత్ర కోసం వరుణ్ ని సంప్రదించగా ఆయన ఓకె చేశారని సదరు కథనాల సారంశం. 


ఈ వార్తపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ భారీగా వైరల్ అవుతుంది. చిరంజీవి సినిమాలో పాత్ర అంటే వరుణ్ నో చెప్పే అవకాశం లేదు. కాబట్టి నిజంగా వరుణ్ లూసిఫర్ రీమేక్ లో నటించే అవకాశాలు లేకపోలేదని కొందరు అంటున్నారు. గతంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు వార్తలు రాగా, ఆయన స్వయంగా స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఆచార్య మూవీలో చిరు-చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.