తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బుచ్చిబాబు (Buchhibabu sana)స్క్రిప్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నాడట. సినిమా చేద్దామని హామీ కూడా ఇచ్చాడని టాలీవుడ్ లో ప్రచారం నడుస్తుంది. సుకుమార్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో మూవీ చేయగా... ఆ చిత్రానికి బుచ్చిబాబు పని చేశారు.
దర్శకుడు సానా బుచ్చిబాబుకు ఎన్టీఆర్ (NTR)సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బుచ్చిబాబు స్క్రిప్ట్ నచ్చిన ఎన్టీఆర్ సినిమా చేద్దామని హామీ ఇచ్చాడనేది లేటెస్ట్ బజ్.
ఒక్క హిట్ సినిమాలు చాలు ఫేట్ మారిపోవడానికి. ఉప్పెన చిత్రంతో హీరోయిన్ కృతి శెట్టి, హీరో వైష్ణవ్ తేజ్ తో పాటు దర్శకుడు బుచ్చిబాబు ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. ముఖ్యంగా కృతి శెట్టికి మంచి పునాది వేసింది. ఉప్పెన విజయంతో కృతి శెట్టికి వరుస ఆఫర్స్ వచ్చిపడ్డాయి. ఏకంగా అరడజను సినిమాల వరకు ఆమె సైన్ చేశారు. అలాగే దర్శకుడు బుచ్చిబాబు కోసం కూడా హీరోలు క్యూ కడుతున్నారట.
అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బుచ్చిబాబు (Buchhibabu sana)స్క్రిప్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నాడట. సినిమా చేద్దామని హామీ కూడా ఇచ్చాడని టాలీవుడ్ లో ప్రచారం నడుస్తుంది. సుకుమార్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో మూవీ చేయగా... ఆ చిత్రానికి బుచ్చిబాబు పని చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్, బుచ్చిబాబుకు పరిచయం ఏర్పడింది. నాన్నకు ప్రేమతో షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తనతో చాలా ఆప్యాయంగా మాట్లాడినట్లు బుచ్చిబాబు తెలియజేశాడు. ఆ పరిచయం కారణంగానే ఈ జోడీ కుదిరింది అంటున్నారు. ఎంత స్నేహం ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన జరిగే వరకు ఈ కాంబినేషన్ నమ్మలేం.
మరోవైపు ఎన్టీఆర్ బడా బడా దర్శకులతో సినిమాలు కమిటై ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ ఆయన కోసం ఓ పాన్ ఇండియా సబ్జెక్టు సిద్ధం చేసి ఉంచాడు. ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన కూడా జరిగిపోగా... త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధంగా కాగా... కొరటాలతో నెక్స్ట్ మూవీ చేస్తున్నారు. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ ప్రకటించారు. దర్శకుడు అట్లీ, సంజయ్ లీలా భన్సాలీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి ఎన్టీఆర్-బుచ్చిబాబు మూవీ ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో.
కాగా ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా వ్యాప్తి కారణంగా ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా... చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఇటీవలే విడుదలపై క్లారిటీ ఇచ్చారు. మార్చ్, ఏప్రిల్ నెలల్లో రెండు విడుదల తేదీలు ప్రకటించారు.
