ఓ స్టార్ హీరోతో మూవీ చేయాలని సుధా కొంగర ప్రణాళికలు వేస్తున్నారట. ఈ లిస్ట్ లో మొదట మహేష్ ఉన్నాడని సమాచారం. ఓ స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్న సుధా... మహేష్ కి వినిపించి, ప్రాజెక్ట్ ఓకె చేయించాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలో మహేష్ ని కలిసి ఆమె స్క్రిప్ట్ వినిపించాలని చూస్తున్నారట.
సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ మూవీపై పరిశ్రమలో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆయనతో ఓ లేడీ డైరెక్టర్ మూవీ చేసే ఆలోచనలో ఉన్నారట. విషయంలోకి వెళితే సూర్య హీరోగా ప్రైమ్ లో విడుదలైన సూరారై పోట్రు భారీ విజయాన్ని నమోదు చేసింది. విమర్శుకుల ప్రశంశలతో పాటు, ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సూరరై పోట్రు బెస్ట్ మూవీగా నిలిచింది. తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ తో విడుదల కాగా రెండు భాషల్లో ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది.
సూరరై పోట్రు చిత్రానికి లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించారు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జి ఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా ఆమె తెరకెక్కించిన సూరరై పోట్రు, ఆమె ఇమేజ్ భారీగా పెంచేసింది. సుధా కొంగర టేకింగ్ అద్భుతం అంటూ ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఓ స్టార్ హీరోతో మూవీ చేయాలని సుధా కొంగర ప్రణాళికలు వేస్తున్నారట. ఈ లిస్ట్ లో మొదట మహేష్ ఉన్నాడని సమాచారం. ఓ స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్న సుధా... మహేష్ కి వినిపించి, ప్రాజెక్ట్ ఓకె చేయించాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలో మహేష్ ని కలిసి ఆమె స్క్రిప్ట్ వినిపించాలని చూస్తున్నారట. మరి మహేష్ కనుక ఓకె చేస్తే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం ఖాయం అంటున్నారు.
ఇటీవలే సర్కారు వారి పాట షూటింగ్ దుబాయ్ లో మొదలు కాగా మహేష్ పాల్గొంటున్నారు. సర్కారు వారి పాట చిత్రం తరువాత మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించలేదు . రాజమౌళితో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ అది ఎప్పటికి సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ లేదు. కాబట్టి మహేష్ కథ నచ్చితే సుధా కొంగర పని సులువు అయినట్లే. సుధా హీరో అజిత్ తో కూడా మూవీ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
