బిగ్ బాస్ హౌస్లోకి కుమారి ఆంటీ? ఇక రచ్చ రచ్చే!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది కుమారి ఆంటీ. ఆమె బిజినెస్ ఇటీవల క్లోజ్ చేయించారు పోలీసులు. ఈ వ్యవహారం ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరకూ వెళ్ళింది.
ఆంధ్రప్రదేశ్ కి చెందిన కుమారి కుటుంబంతో పాటు హైదరాబాద్ లో ఉంటుంది. ఆమె చాలా ఏళ్లుగా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తుంది. తక్కువ ధరకే పలు రకాల నాన్ వెజ్ వంటకాలలో భోజనం అందించడం ఆమె ప్రత్యేకత. పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే యువత, కార్మికులు ఆమె వద్ద మధ్యాహ్నం భోజనం చేస్తారు. నెలకు కుమారి ఆంటీ ఈ బిజినెస్ మీద లక్షలు సంపాదిస్తుందని సమాచారం.
కొందరు యూట్యూబర్స్ ఈమెను ఇంటర్వ్యూ చేశారు. ఫుడ్ వ్లాగర్స్ రీల్స్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. కస్టమర్స్ తో పాటు ఫుడ్ వ్లాగర్స్ పెద్ద ఎత్తున కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ వద్దకు చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఆగ్రహించిన పోలీసులు కుమారి ఆంటీ అక్కడ బిజినెస్ చేయడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు.
ఈ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజకీయ రంగు పులుముకుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఇల్లు ఇచ్చాడని కుమారి ఆంటీ చెప్పింది. అది నచ్చని చంద్రబాబు శిష్యుడైన సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ బిజినెస్ దెబ్బ తీశాడంటూ ప్రచారం జరిగింది. కారణం ఏదైనా కుమారి ఆంటీ బిజినెస్ ని క్లోజ్ చేయించడం విమర్శల పాలైంది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఆమె బిజినెస్ చేసుకునేందుకు అనుమతివ్వాలని సూచనలు ఇచ్చాడు.
గత రెండు రోజులుగా కుమారి ఆంటీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ క్రమంలో కుమారి ఆంటీ ఏకంగా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడుతున్నారంటూ ప్రచారం మొదలైంది. అనుకున్న సమయం కంటే ముందే బిగ్ బాస్ 8 ప్రసారం కానుందట. కుమారి ఆంటీని హౌస్లోకి పంపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఇదే నిజమైతే హౌస్లో రచ్చ రచ్చే అని చెప్పొచ్చు..