విక్రమ్ వేద రీమేక్ లో పవన్ కళ్యాణ్... ఆ స్టార్ హీరో కూడా?

పవన్ కళ్యాణ్ మరో రీమేక్ కి సిద్ధమయ్యాడనే వార్త టాలీవుడ్ ని ఊపేస్తోంది. ఈసారి రవితేజతో మల్టీస్టారర్ ప్లాన్ చేశాడంటున్నారు. 
 

crazy buzz pawan kalyan plans vikram veda remake ksr

పవన్ కళ్యాణ్ ది రెండు పడవల ప్రయాణం. ఇటు సినిమాల్లో రాణిస్తూనే రాజకీయంగా ఎదగాలనేది ఆయన ఆలోచన. పార్టీని నడపాలంటే డబ్బులు కావాలి అందుకే సినిమాలు చేస్తున్నానని ఆయన వివరణ కూడా ఇచ్చారు. 2019 ఎన్నికలకు ముందు సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందుకో మనసు మార్చుకున్నారు. కమ్ బ్యాక్ ప్రకటించారు. గత మూడేళ్ళలో పవన్ కళ్యాణ్ నుండి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. 

ఇవి మూడు రీమేకులే. ఫ్యాన్స్ ఇజ్జత్ కోసం చొక్కాలు చించుకున్నారు కానీ వాళ్లు కోరుకున్న సబ్జక్ట్స్ కాదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో ఆయన ఇమేజ్ కి సరిపడని సబ్జక్ట్స్. దీంతో ఫలితం కూడా సోసో గానే ఉంది. బ్రో డిజాస్టర్ కాగా... వకీల్ సాబ్, భీమ్లా నాయక్ స్వల్ప నష్టాలతో బయటపడ్డాయి. రీమేక్స్ వద్దు మహాప్రభో అని ఫ్యాన్స్ ఒక ప్రక్క గగ్గోలు పెడుతున్నారు. అయినా ఆయన వినడం లేదు. 

స్ట్రైట్ మూవీ హరి హర వీరమల్లును అక్కడే పెట్టి రెండు రీమేక్స్ చేసి వదిలాడు. ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో మరో రీమేక్ సిద్ధం అవుతుంది. ఇది తేరీ రీమేక్. హరీష్ శంకర్ మార్క్ మార్పులు చేర్పులతో తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రీమేక్స్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం తక్కువ సమయంలో పూర్తి కావాలి. రాజకీయంగా ఆయనకు సౌలభ్యం కలిగించాలి. దాదాపు సెట్స్ లో పూర్తి చేయాలి. విదేశీ షెడ్యూల్స్ గట్రా ఉండకూడదు. 20 రోజులు షూటింగ్ చేసినా 50 రోజులు షూటింగ్ చేసినా ఆయనకు రావాల్సిన రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేయాలి. 

ఇదిలా ఉండగా మరో రీమేక్ పై ఆయన కన్నేశాడని అంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడిగా రామ్ తళ్లూరి నిర్మాతగా ఒక మూవీ ప్రకటించారు. అది కార్యరూపం దాల్చలేదు. ఇక రామ్ తళ్లూరికి పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉండగా విక్రమ్ వేద రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. సురేందర్ రెడ్డి దర్శకుడిగా రవితేజ మరో హీరోగా ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్. రవితేజతో నేల టిక్కెట్టు మూవీ చేసి నష్టపోయిన రామ్ తళ్లూరికి రవితేజ మరో మూవీ చేసేందుకు సుముఖంగా ఉన్నారట. 

ఈ క్రమంలో విక్రమ్ వేద రీమేక్ లో పవన్ కళ్యాణ్-రవితేజ నటించే అవకాశం కలదంటున్నారు. కాగా విక్రమ్ వేద ఒరిజినల్ లో మాధవన్, విజయ్ సేతుపతి నటించారు. కల్ట్ క్లాసిక్ గా అది నిలిచింది. ఆ చిత్రాన్ని హిందీలో హృతిక్-సైఫ్ చేశారు. అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఆల్రెడీ చాలా మంది చూసేసిన విక్రమ్ వేద తెలుగులో ఆడుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. అదే సమయంలో ఇవన్నీ పుకార్లే, పవన్ కళ్యాణ్ ఈ చిత్రం చేయడం లేదంటారు. దీనిపై స్పష్టమైన సమాచారం అందాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే... 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios