మెగా ఫ్యామిలీ...హీరోల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లా తయారవగా కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. ధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ బాలనటుడిగా కూడా నటించడం జరిగింది. కాగా అరంగేట్రమే మంచి కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉప్పెన ఆయన డెబ్యూ మూవీగా తెరకెక్కింది. దర్శకుడు సానా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. సినిమా ప్రోమోలతో పాటు, దేవిశ్రీ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విడుదలే తరువాయి విజయం తథ్యం అనుకుంటున్న తరుణంలో లాక్ డౌన్ రూపంలో ఉప్పెన విడుదలకు బ్రేక్ పండింది. 

డెబ్యూ హీరో అయినా ఎందుకో ఓటిటికి ఒప్పుకోవడం లేదు. సంస్థలైతే ఫ్యాన్సీ ఆఫర్స్ తో సిద్ధంగా ఉన్నాయి. కాగా ఉప్పెన విడుదల కాకుండానే ఈ మెగా హీరో మరో ప్రాజెక్ట్ ఒకే చేశారు. టాలీవుడ్ బడా దర్శకులలో ఒకరైన క్రిష్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేశాడు. వైష్ణవ్ తదుపరి చిత్రం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇక స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం మరో విశేషం. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని నిర్మాత రాజీవ్ రెడ్డితో కలిసి క్రిష్ స్వయంగా నిర్మించనున్నారు. 

ఐతే ఈ మూవీ బ్యాక్ డ్రాప్ పై ఓ ఆసక్తి వార్త పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. క్రిష్ ఈ మూవీ నేపధ్యాని అడవిలో సెట్ చేశారట. కథ ప్రకారం మూవీ ప్రధాన భాగం అడవిలోనే నడుస్తుందట. ఇక హీరో వైష్ణవ్ సాహసాలు అబ్బురపరుస్తాయని సమాచారం. హీరోయిన్ రకుల్ పాత్రకు కూడా కథలో గట్టి ప్రాధాన్యం ఉంటుందట. దీనితో వైష్ణవ్ రెండో చిత్రంతోనే క్రేజీ ఆఫర్ దక్కించుకున్నాడని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది.