పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా నెట్టింటక్రేజీ బజ్ వినిపిస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో మరో బిగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తారక్ ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో కలిసి నటించిన మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’RRR ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరోవైపు బాక్సాఫీసు వద్ద కూడా ఆర్ఆర్ఆర్ కాసుల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయి 10 రోజులు గడిచినా ఇంకా థియేటర్ల నిండా ప్రేక్షకుల సందడే నెలకొంది. అల్లూరి సీతారామా రాజుగా చరణ్, కొమురం భీంగా తారక్ జీవించారని విమర్శకులు సైతం ప్రశంసించారు. ఇక ఆర్ఆర్ఆర్ ఒక్కో రికార్డును బ్రేక్ చేసుకుంటూ పోతోంది. ఈ చిత్రానికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య దాదాపు రూ.500 కోట్లకుపైగా ఖర్చు పెట్టి నిర్మించారు. ఎంఎం కీరవాణీ సంగీతం అందించారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నార్త్ లోనూ మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆయన తర్వాతి సినిమా NTR30పై ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా క్రేజీ బజ్ వినిపిస్తోంది. డైరెక్టర్ కొరటాల శివతో గతంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటించారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమా రూపుదిద్దుకోనుంది. అయితే ఈ చిత్ర షూటింగ్ జూలై మధ్య నెలలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.
RRR విడుదలకు ముందు, ఎన్టీఆర్ గతేడాది ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ 30 సినిమాపై మాట్లాడారు. ఈ చిత్ర విడుదలపై క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా తన అప్ కమింగ్ ఫిల్మ్ ను 2022లోనే విడుదల చేస్తామని తెలిపారు. కానీ తాజా బజ్ ప్రకారం షూటింగ్ మాత్రం జూలైలో ప్రారంభం కానుండటంతో వచ్చే ఏడాదికే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది.
