టాలీవుడ్ స్టార్ హీరోలందరూ జోరుమీదున్నారు. ఒకరికి మించి మరొకరు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు. తెలుగు పరిశ్రమకు చెందిన హీరోల మార్కెట్ పెరిగిన నేపథ్యంలో ఇతర పరిశ్రమలకు చెందిన స్టార్ డైరెక్టర్స్ చిత్రాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే, దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తున్నారు. చరణ్ రామరాజుగా చేస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తున్నారు. 


కాగా ఎన్టీఆర్ తన 30వ చిత్రం దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే దీనిపై అధికారిక ప్రకటన చేశారు. ఓ పవర్ ఫుల్ సబ్జెక్టుతో కొరటాల తన మార్క్ మూవీ తెరకెక్కించనున్నాడట. అయితే కొరటాల మూవీ తరువాత ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తారట. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని రూపొందించనుంది అనేది సమాచారం. ఎన్టీఆర్ 31వ చిత్రం ప్రశాంత్ నీల్ తోనే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ ట్రెండ్ అవుతుంది. 


ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై కథనాలు రావడం జరిగింది. అనూహ్యంగా ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో సలార్ ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్ పై కథనాలు ఆగిపోయాయి. తాజాగా మరలా ఎన్టీఆర్ 31వ చిత్రం ప్రశాంత్ నీల్ తోనే అంటూ ప్రచారం జరుగుతుంది. 


మరోవైపు ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ పరిస్థితి అయోమయంలో ఉంది. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీ ప్రకటించారు.  2020 ఏప్రిల్ నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అనేక కారణాల చేత ఈ ప్రాజెక్ట్ డిలే కావడం జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివతో ప్రకటించడం సంచలంగా మారింది.