చిరంజీవి పుట్టినరోజు కానుకాగా ఆయన నుండి ఫ్యాన్స్ కి భారీ గిఫ్ట్ రావడం జరిగింది. తన 65వ పుట్టినరోజు పురస్కరించుకొని  మూవీ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల కావడం జరిగింది. అదిరిపోయే మణిశర్మ బీజీఎమ్ తో కూడిన థీమ్ అండ్ చిరు లుక్ కేక పుట్టించాయి. ధర్మ స్థలి అనే ఓ పురాతన ద్వారం దగ్గర చిరు విలన్స్ తో పోరాడుతున్నాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో  సన్యాలను కూడా మనం చూడవచ్చు. మొత్తంగా ఒక బలమైన కథకు దర్శకుడు కొరటాల శివ కమర్షియల్ అంశాలు జోడించి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు అనిపిస్తుంది. 

ఐతే మోషన్ పోస్టర్ చూశాక టాలీవుడ్ లో ఓ ఆసక్తికర ప్రచారం మొదలైంది. ఆచార్య మూవీ కథపై ఎప్పటి నుండో ఓ పుకారు ప్రచారంలో ఉంది.  ఈ చిత్రం పురాతన ఆలయాలు, వారసత్వ సంపదపై తెరకెక్కుతున్న చిత్రమట. సామాజికవాది అయిన చిరంజీవి స్వార్ధపరులనుండి వాటిని కాపాడడానికి పోరాటం సాగిస్తాడట. మరి విడుదలైన మోషన్ పోస్టర్ లో పురాతన ధర్మ స్థలి అనే ఒక ప్రదేశం కనిపిస్తుంది. దాని కోసం పోరాడుతున్నట్లు చిరంజీవి ఫైట్ నేపథ్యం కూడా ఉంది. ఇవన్నీ గమనిస్తుంటే ప్రచారం జరిగినట్లుగా ఇది వారసత్వ సంపదను కాపాడుకోవడానికి చిరంజీవి ఆచార్యగా చేసే పోరాటంగా అని ప్రచారం అవుతుంది. 

మరి ఈ విషంపై పూర్తి స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. లాక్ డౌన్ ముందు వరకు ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా జరిగింది. దాదాపు 40 శాతానికి పైగా పూర్తి అయినట్లు సమాచారం ఉంది. ఆచార్య మూవీ 2021 సమ్మర్ లో విడుదల కానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.