కొన్ని కాంబినేషన్స్ పై ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరు టాప్ స్టార్స్ మల్టీస్టారర్ చేస్తే చూడాలని చాలా మంది కోరుకుంటారు. నందమూరి, మెగా ఫ్యామిలీకి చెందిన టాప్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ చేస్తూ, రాజమౌళి ఆ కల సాకారం చేశారు. దీనితో దేశవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ పై ఆసక్తి నెలొకొని ఉంది. కాగా ఎన్టీఆర్ మరో టాప్ స్టార్ తో మూవీ చేయడానికి సిద్ధం అయ్యారని ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

 
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నాయనేది ఆ వార్తల సారాంశం. విజయ్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దర్శకుడు అట్లీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారట. పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతుందట. ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ గట్టిగా ప్రచారం అవుతుంది. 


నిజంగా ఎన్టీఆర్-విజయ్ కాంబినేషన్ లో మూవీ వస్తే పండగే అని చెప్పాలి. సౌత్ ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్ట్ గా ఆ చిత్రం నిలిచిపోతుంది. మరోవైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ విడుదల నేపథ్యంలో రాజమౌళి షూటింగ్ లో నిమగ్నమై ఉన్నారు. 


ఇక ఎన్టీఆర్ తన 30వ చిత్రం కొరటాల శివతో ప్రకటించారు. త్రివిక్రమ్ తో ప్రకటించిన మూవీ హోల్డ్ లో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ బర్త్ డే మే 20న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై ప్రకటన రానుందని ప్రచారం జరుగుతుంది.