Asianet News TeluguAsianet News Telugu

ఇంట్రెస్టింగ్ బజ్.. చిరు సినిమాలో నాగ్ వైఫ్?

 లూసిఫర్ మూవీలో హీరో చెల్లెలి పాత్ర చాలా పవర్ ఫుల్ గా, కథలో కీలకంగా ఉంటుందని సమాచారం. విద్యాబాలన్, నయనతార వంటి స్టార్స్  ఈ పాత్ర చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. తాజాగా మరో క్రేజీ నేమ్ తెరపైకి వచ్చింది. 

crazy buzz nagarjuna wife amala will be seen chiranjeevi sister in lucifer remake ksr
Author
Hyderabad, First Published Jul 4, 2021, 6:00 PM IST

కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస చిత్రాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. దర్శకుడు కొరటాల శివతో ఆయన చేస్తున్న ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉంది. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడింది. కాగా చిరంజీవి తన తదుపరి చిత్రం తమిళ దర్శకుడు మోహన్ రాజాతో చేస్తున్నారు. 
 

మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో ఆయన నటించనున్నారు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ మంచి విజయాన్ని సాధించింది. తన ఇమేజ్ కి చక్కగా సరిపోతుందని భావించిన చిరంజీవి లూసిఫర్ రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 


కాగా ఈ మూవీలో హీరో చెల్లెలి పాత్ర చాలా పవర్ ఫుల్ గా, కథలో కీలకంగా ఉంటుందని సమాచారం. విద్యాబాలన్, నయనతార వంటి స్టార్స్  ఈ పాత్ర చేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. తాజాగా మరో క్రేజీ నేమ్ తెరపైకి వచ్చింది. కింగ్ నాగార్జున భార్య అమల అక్కినేని చిరంజీవి చెల్లెలి పాత్ర చేయనున్నారంటూ టాలీవుడ్ లో టాక్ మొదలైంది. ఆ పాత్ర కోసం ఆమెను సంప్రదించారని, ఓకే చెప్పారనేది సదరు వార్తల సారాంశం. 


దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది.  ఇకవేళ ఇదే నిజమైతే ఈ ప్రాజెక్ట్ మరింత హైప్ తెచ్చుకునే అవకాశం కలదు. అమల ఈ మధ్య క్యారెక్టర్ రోల్స్ చేస్తుండగా ఈ పుకార్లను కొట్టిపారేయలేం. మరోవైపు చిరు దర్శకులు మెహర్ రమేష్, బాబీలతో చిత్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే... 
 

Follow Us:
Download App:
  • android
  • ios