Asianet News TeluguAsianet News Telugu

లైగర్ క్లైమాక్స్ పై గూస్ బంప్స్ కలిగించే న్యూస్!

పతాక సన్నివేశాలలో ఓ విదేశీ ఫైటర్ లో విజయ్ భీకరంగా పోరాడుతాడని కూడా తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ విజయంతో ఊపు మీదున్న పూరి జగన్నాధ్ చాలా కాన్ఫిడెంట్ తో లైగర్ తెరకెక్కిస్తున్నాడు.

crazy buzz ligar climax will be an eye feast for vijay devarakonda fans ksr
Author
Hyderabad, First Published Jun 9, 2021, 6:31 PM IST

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో లైగర్ ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. లైగర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలా ఉండనుందో అన్న ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. 


ఈ మూవీ గురించి మరో క్రేజీ న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. లైగర్ మూవీ క్లైమాక్స్ పూరి తనమార్కు యాక్షన్ ఎమోషన్స్ తో సరికొత్తగా రూపొందించనున్నాడట. పది నిమిషాలకు పైగా సాగనున్న క్లైమాక్స్ సన్నివేశంలో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్ హైలెట్ కానున్నాయట. లైగర్ మూవీ ఫైటింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ రోల్ చేస్తున్నాడు. 


పతాక సన్నివేశాలలో ఓ విదేశీ ఫైటర్ లో విజయ్ భీకరంగా పోరాడుతాడని కూడా తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ విజయంతో ఊపు మీదున్న పూరి జగన్నాధ్ చాలా కాన్ఫిడెంట్ తో లైగర్ తెరకెక్కిస్తున్నాడు. రమ్య కృష్ణ కీలక రోల్ చేస్తున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios