రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలు ప్రకటించడంతో పాటు, వాటిని వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. రాధే శ్యామ్ షూటింగ్ ఎప్పటి నుండో జరుగుతుండగా.. సలార్ మరియు ఆదిపురుష్ చిత్రాల షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. సలార్ మూవీ షూటింగ్ గోదావరి ఖనిలో గల మైనింగ్ ఏరియాలో మొదలుపెట్టారు. హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొంటున్న ఈ షెడ్యూల్ నందు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. 

కాగా సలార్ మూవీలో విలన్ పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి విలన్ గా కన్నడ నటుడు మధు గురుస్వామిని ఎంపిక చేశారట. కన్నడ పరిశ్రమలో విలన్ పాత్రలకు బాగా పాప్యులర్ అయిన మధు గురు స్వామిని ప్రభాస్ కి విలన్ గా చేయడం దాదాపు ఖాయమే అన్న మాట వినిపిస్తుంది. హీరో పాత్రలకు ధీటుగా విలన్ పాత్రలను ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ దిట్ట. కెజిఎఫ్ తరహాలో సలార్ లో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. 

మరి దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక సలార్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుందని అంటున్నారు. మరో వైపు ప్రభాస్ తన ఫ్యాన్స్ కి వాలెంటైన్స్ డే నాడు మంచి గిఫ్ట్ సిద్ధం చేశాడు. రాధే శ్యామ్ మూవీ నుండి ఫిబ్రవరి 14న ఫస్ట్ గ్లిమ్స్ వీడియో విడుదల కానుంది.