Asianet News TeluguAsianet News Telugu

పెళ్ళైన నాలుగేళ్లకు స్వీట్ న్యూస్... తండ్రి కాబోతున్న హీరో నిఖిల్!

హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పెళ్ళైన నాలుగేళ్లకు ఆయన స్వీట్ న్యూస్ చెప్పనున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి... 
 

crazy buzz is hero nikhil wife pallavi got pregnancy ksr
Author
First Published Nov 13, 2023, 9:06 AM IST

హీరో నిఖిల్ స్వయంభు చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామా. స్వయంభులో ఆయన లాంగ్ హెయిర్ తో కనిపించనున్నారు. కత్తి సాము వంటి యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. పాన్ ఇండియా మూవీగా స్వయంభు భారీగా విడుదల కానుంది. స్వయంభు నిఖిల్ 20వ చిత్రంగా విడుదల అవుతుంది. భరత్ కృష్ణమాచార్య దర్శకుడు. నిఖిల్ కి జంటగా సంయుక్త మీనన్ నటించనుంది. 

కాగా నిఖిల్ తండ్రి కాబోతున్నాడట. ఆయన భార్య పల్లవి ప్రెగ్నెంట్ అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న పల్లవి బేబీ బంప్ తో కనిపించారట. ఈ క్రమంలో పల్లవి గర్భవతి అంటూ కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. నిఖిల్, పల్లవి సమాచారం ఇవ్వలేదు. వృత్తిరీత్యా పల్లవి డాక్టర్ కాగా ఆమెను నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020లో కోవిడ్ ఆంక్షల మధ్య వీరి వివాహం జరిగింది. 

Also Read నడుము మడతలు చూపిస్తూ నరాలు జివ్వు మనిపించింది ప్రగ్యా జైస్వాల్... బాలయ్య భామ హాట్ ఫోటోస్ వైరల్

పెళ్ళై నాలుగేళ్లు అవుతుండగా నిఖిల్-పల్లవి స్వీట్ న్యూస్ చెప్పనున్నారట. ఆ మధ్య నిఖిల్, పల్లవి విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను తమదైన శైలిలో వీరు ఖండించారు. ఇద్దరూ జంటగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నిఖిల్ హ్యాపీ డేస్ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రాలు ఫేమ్ తెచ్చాయి. కార్తికేయ 2 ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. నిఖిల్ గత చిత్రం స్పై నిరాశపరిచింది... 
 

నేచురల్‌ అందంతో అనసూయ కవ్వింపు చర్యలు.. ఫ్యామిలీతో కలిసి హాట్‌ యాంకర్‌ దివాళి సెలబ్రేషన్‌ నెక్ట్స్ లెవల్‌

Follow Us:
Download App:
  • android
  • ios