క్రేజీ బజ్... అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో చిరంజీవి మూవీ!
టాలీవుడ్ వర్గాల్లో ఓ క్రేజీ బజ్ వినిపిస్తుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో చిరంజీవి ప్రాజెక్ట్ ఓకే అయ్యిందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ మధ్య చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగాతో ఆయన ప్రాజెక్ట్ ఓకే అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం యానిమల్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 1న యానిమల్ విడుదల కానుంది. రన్బీర్ కపూర్-రష్మిక మందాన జంటగా నటిస్తుండగా గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతుంది. సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో స్పిరిట్ ప్రకటించారు. ప్రభాస్ సలార్, రాజా డీలక్స్, కల్కి చిత్రాలతో బిజీగా ఉన్నారు. స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లేందుకు ఏడాది సమయం పట్టనుంది. ఈ లోగా చిరంజీవితో సందీప్ రెడ్డి వంగా మూవీ ఉంటుందని అంటున్నారు.
యానిమల్ అనంతరం సందీప్ రెడ్డి చేసే మూవీ చిరంజీవిదే అన్న వాదన వినిపిస్తోంది. దీనిపై చిరంజీవి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే రికార్డ్స్ బ్రేక్ అంటున్నారు. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.
కాగా భోళా శంకర్ పూర్తిగా నిరాశపరిచిన నేపథ్యంలో చిరంజీవి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇకపై రీమేక్స్ చేయవద్దంటూ ఆయనకు అభిమానులు సలహాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆచితూచి సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. బింబిసార మూవీతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ వశిష్ట్ కి అవకాశం ఇచ్చాడు. కొన్నాళ్లుగా చిరంజీవి-వశిష్ట్ కాంబినేషన్ లో మూవీ ఉందని ప్రచారం జరుగుతుంది. నేడు దీనిపై ఇటీవల అధికారికంగా ప్రకటన వచ్చింది.
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా చిరంజీవి 157వ చిత్రంగా తెరకెక్కుతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానుండగా త్వరలో మూవీ పట్టాలెక్కనుంది. పంచ భూతాలు ప్రధానంగా క్రేజీ కాన్సెప్ట్ తో వశిష్ట్ ఈ చిత్రం తెరకెక్కించనున్నాడు. అలాగే దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చిరంజీవి ఒక మూవీ చేయాలనున్నారు. ఇది మలయాళ చిత్రం బ్రో డాడీ రీమేక్ అని సమాచారం. దాదాపు ఫైనల్ అయిన ఈ ప్రాజెక్ట్ విషయంలో చిరంజీవి సందిగ్ధంలో పడ్డారని సమాచారం. భోళా శంకర్ ఫలితం నేపథ్యంలో ఈ చిత్రాన్ని చేస్తారా లేదా? అనే చర్చ నడుస్తుంది.