పూజ హెగ్డే బర్త్ డే కానుకగా రాధే శ్యామ్ మూవీ నుండి ఆమె లుక్ విడుదల చేశారు. 60ల కాలం నాటి యూరప్ కల్చర్ గుర్తు చేసేలా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఉంది. అలాగే పూజా క్యారెక్టర్ సాఫ్ట్ మరియు సెన్సిబుల్ గా ఉంటుందని ఆమె లుక్ చూసిన తరువాత అర్థం అయ్యింది. ఐతే రాధే శ్యామ్ మూవీలో పూజ పాత్ర పేరును ప్రేరణగా పరిచయం చేశారు. దీనితో టాలీవుడ్ ప్రేక్షకులలో కొత్త డౌట్స్ మొదలయ్యాయి. 

దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టైటిల్ ని రాధే శ్యామ్ గా నిర్ణయించగా, ప్రభాస్ పేరు శ్యామ్, పూజ పేరు రాధా అని అందరూ అనుకుంటున్నారు. తాజా పోస్టర్ ద్వారా పూజ పాత్ర పేరు ప్రేరణ అని మరి తెలుస్తుంది.దీనితో మరి రాధ ఎవరు అనే డౌట్ అందరిలో మొదలైంది. కాగా గతంలో ఈ మూవీ కథపై కొన్ని కథనాలు రావడం జరిగింది. రాధే శ్యామ్ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందని కథనాలు వచ్చాయి. 

రెండు తరాలకు చెందిన ప్రేమికులుగా ప్రభాస్, పూజ కనిపిస్తారని ఆ వార్తల సారాంశం. తాజా పోస్టర్ నేపథ్యంలో గతంలో వచ్చిన కథనాలు నిజం కావచ్చనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఓ జనరేషన్ లో రాధా, శ్యామ్ గా, మరో జన్మలో నడిచే ఎపిసోడ్ లో వేరొక పేర్లతో వీరి పాత్రలు ఉంటాయనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ మూవీలో మరో ప్రధాన హీరోయిన్ లేరు. కాబట్టి ఈ అనుమానంలో లాజిక్ ఉందని అందరూ అంటున్నారు. 

మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే మూవీ నుండి టీజర్ లేదా ట్రైలర్ విడుదల కావాలి. ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23కాగా ఆరోజున టీజర్ విడుదల అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.