మెగాస్టార్ చిరంజీవి ఆచార్య గా మే 13న థియేటర్స్ లో దిగనున్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కాగా ఇప్పటికే ఆచార్య వరల్డ్ వైడ్ బిసినెస్ పూర్తి అయినట్లు వార్తలు వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆచార్య రూ. 120కోట్లకు పైగా బిజినెస్ చేసిందని వినికిడి. ఆచార్య నైజాం హక్కులు రూ. 40కోట్లకు పైగా అమ్ముడు పోయాయట. ఇక ఆంధ్రా, సీడెడ్ కలిపి మరో రూ. 80కోట్లకు అమ్మారట. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఆచార్య థియేట్రికల్ బిజినెస్ రూ. 140 కోట్లను దాటేసిందని వినికిడి. 

కోవిడ్ తరువాత గతంలో మాదిరి వందల కోట్ల వసూళ్లు సాధ్యమేనా అని, అందరూ భావించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ 50శాతం ఆక్యుపెన్సీతో కూడా రికార్డు వసూళ్లు రాబట్టింది. సినిమాలో విషయం ఉంటే వసూళ్ల మోత ఖాయం అని తెలుస్తున్న నేపథ్యంలో ఆచార్య చిత్రానికి ఈ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఆచార్య టీజర్ కూడా సినిమా విజయంపై నమ్మకం కలిగించింది. 

దానికి తోడు ఆచార్య మూవీలో రామ్ చరణ్ కీలక రోల్ చేస్తున్నాడు. మగధీర, బ్రూస్లీ చిత్రాలలో చిరంజీవి క్యామియో రోల్స్ చేయడం జరిగింది. కానీ ఆచార్యలో చరణ్ అరగంటకు పైగా నిడివి కలిగిన కీలక రోల్ చేస్తున్నారు. కాబట్టి మెగా హీరోలు చేస్తున్న మల్టీస్టారర్ గా దీనిని చెప్పవచ్చు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఆచార్య చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.