Asianet News TeluguAsianet News Telugu

పనికిమాలిన షో.. ఎవడికి ఉపయోగం: బిగ్‌బాస్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

బూతులు, కొట్లాటలతో సాగే బిగ్‌బాస్‌ షో అనైతికమని సీపీఐ నారాయణ అభిప్రాయపడ్డారు. దీన్ని ఆపాలంటూ గతంలో కోర్టుకెక్కినప్పటికీ, అటు న్యాయవ్యవస్థ, ఇటు పోలీసులు తనకు ఏమాత్రం సాయం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనికిమాలిన షోను టీవీలో ప్రసారం చేసేందుకు అనుమతించకూడదని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.

cpi narayana sensational comments on big boss show
Author
New Delhi, First Published Sep 11, 2021, 6:29 PM IST

బిగ్‌బాస్‌ రియాలిటీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్‌ షో వల్ల ఎవరికి ఉపయోగమో చెప్పాలన్నారు. ఇలాంటి షోలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయో అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. ఈ అనైతిక షోను వేల కోట్ల వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని నారాయణ ఆరోపించారు. బూతులు, కొట్లాటలతో సాగే బిగ్‌బాస్‌ షో అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:బిగ్‌బాస్‌5ః షణ్ముఖ్‌ పరువు తీసేసిన నాగార్జున.. హైజ్‌లోని లవ్‌ ట్రాక్స్ రివీల్డ్

దీన్ని ఆపాలంటూ గతంలో కోర్టుకెక్కినప్పటికీ, అటు న్యాయవ్యవస్థ, ఇటు పోలీసులు తనకు ఏమాత్రం సాయం చేయలేదని సీపీఐ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనికిమాలిన షోను టీవీలో ప్రసారం చేసేందుకు అనుమతించకూడదని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గత ఆదివారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. అగ్ర కథానాయకుడు నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios