లైకా ప్రొడక్షన్స్‌కి ₹21 కోట్లు 30% వడ్డీతో కట్టాలని చెన్నై హైకోర్టు విశాల్‌కి ఆర్డర్ వేసింది.
విశాల్, లైకా ప్రొడక్షన్స్ వివాదం
ఇటీవల వివిధ కారణాల వల్ల విశాల్ వార్తల్లో ఉంటున్నారు. తెలుగు తమిళ భాషల్లో ప్రముఖ నటుడైన విశాల్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గతంలో విశాల్ కి, లైకా నిర్మాణ సంస్థకి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం నెలకొంది. విశాల్ తన ‘విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ’ కోసం ఫైనాన్షియర్ అంబు చెళియన్ దగ్గర ₹21.29 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఈ అప్పుని లైకా ప్రొడక్షన్స్ తీర్చేసింది. కానీ విశాల్ ఆ డబ్బు లైకాకి తిరిగి ఇవ్వలేదు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ హక్కులన్నీ లైకాకి ఇవ్వాలని ఒప్పందం కూడా ఉంది.
లైకా ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘించాడు
లైకా ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘించి సినిమాలు రిలీజ్ చేశాడని, డబ్బులు తిరిగి ఇవ్వాలని లైకా హైకోర్టులో కేసు వేసింది. ₹15 కోట్లు డిపాజిట్ చెయ్యాలని విశాల్‌కి కోర్టు ఆర్డర్ వేసింది. డబ్బులు కట్టకపోతే కొత్త సినిమాలు రిలీజ్ చెయ్యకూడదని బ్యాన్ కూడా వేసింది.
విశాల్ కోర్టుకు హాజరు
విశాల్ డిపాజిట్ కట్టకుండా కాలం గడుపుతూ వచ్చాడు. కోర్టు ఆర్డర్‌ని పట్టించుకోకపోవడంతో, విశాల్‌ని కోర్టుకు రావాలని ఆదేశించింది. జడ్జి పి.టి. ఆషా.. విశాల్‌ని మందలించారు. విశాల్ తన ఆస్తుల వివరాలు కోర్టుకు సమర్పించాడు. మూడు కార్లు, ఒక బైక్, రెండు బ్యాంక్ అకౌంట్స్, ఇంటి లోన్ డాక్యుమెంట్స్ ఇచ్చాడు.
విశాల్‌కు కోర్టు ఇచ్చిన తీర్పు
లైకా ప్రొడక్షన్స్‌కి ₹21.29 కోట్లు 30% వడ్డీతో కట్టాలని, కేసు ఖర్చులు కూడా భరించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఇది విశాల్ కి ఊహించని షాక్ అనే చెప్పాలి.
