తమిళ నటుడు శింబు కోర్టుకెక్కి హీరో విశాల్ పై కేసు పెట్టడం ఇప్పుడు కోలివుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వివాదాలకు దగ్గరగా ఉండే శింబు 2017లో 'అన్భానవన్ అడంగాదవన్ అసరాదవన్' అనే సినిమాలో నటించాడు.
తమిళ నటుడు శింబు కోర్టుకెక్కి హీరో విశాల్ పై కేసు పెట్టడం ఇప్పుడు కోలివుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వివాదాలకు దగ్గరగా ఉండే శింబు 2017లో 'అన్భానవన్ అడంగాదవన్ అసరాదవన్' అనే సినిమాలో నటించాడు. మైకేల్ రాయప్పన్ ఈ సినిమాను నిర్మించగా.. ఆదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.
దీంతో నిర్మాత మైకేల్ కి శింబుకి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
శింబు షూటింగ్ కి సరిగ్గా రాకపోవడం, సరిగ్గా సహకరించకపోవడం, కథలో జోక్యం చేసుకోవడం వంటి విషయాల కారణంగా సినిమా ఫ్లాప్ అయిందని.. భారీ నష్టాలని చవిచూడాల్సి వచ్చిందని నిర్మాత ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. తనకు హీరో శింబు నష్ట పరిహారం చెల్లించాలని నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. దీంతో నిర్మాతల మండలి శింబుకి నోటీసులు జారీ చేసిందట.
దానికి శింబు స్పందించకపోవడంతో అతడిపై రెడ్ కార్డ్ విధించినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ శింబు మాత్రం సినిమాలలో నటిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో శింబు నటిస్తోన్న తాజా చిత్రంపై ఈ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో శింబు.. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, నిర్మాత మైకేల్ రాయప్పన్ లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
'అన్భానవన్ అడంగాదవన్ అసరాదవన్' సినిమాలో నటించడానికి రూ.8 కోట్ల పారితోషికం ఒప్పందం కుదుర్చుకుంటే నిర్మాత రూ.5 కోట్లు మాత్రమే ఇచ్చాడని, అంతేకాకుండా తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని శింబు ఆరోపించాడు. దీనికి గాను తనకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకి తెలిపాడు. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కట్ట పంచాయితీ చేస్తున్నాడని ఆరోపించాడు.
తన సినిమాలకు సంబంధించి నిర్మాతల మండలి కానీ, నటీనటుల సంఘం కానీ జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుని కోరారు. మంగళవారం నాడుశింబు తరఫు వాదనలు విన్న కోర్టు పిటిషన్ దాఖలు చేయాల్సిన నిర్మాత మైకేల్ రాయప్పన్ కి, విశాల కి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఈ కేసు ఈ నెల 18కి వాయిదా వేసింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 9, 2019, 1:09 PM IST