Asianet News TeluguAsianet News Telugu

చీటింగ్ కేసులో సల్మాన్ హీరోయిన్ కు బెయిల్

ఒక దుర్గా పూజ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు నటి దాదాపు రూ.12 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుంది. కానీ కార్యక్రమంలో ఆమె పాల్గొనలేదు. 

Court Grants Interim Bail To Bollywood Actor Zareen Khan In Cheating Case JSP
Author
First Published Dec 13, 2023, 2:43 PM IST

 
చీటింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్‌పై కోల్‌కతా కోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది.  2018లో ఆమెపై కేసు నమోదైంది. దర్యాప్తు అధికారి కోల్‌కతాలోని సీల్దా కోర్టులో నటిపై చార్జ్ షీట్ సమర్పించారు. అయితే జరీన్ ఖాన్ బెయిల్ కోసం అప్పీల్ చేయకపోగా, కోర్టుకు కూడా హాజరు కాలేదు. ఆమె పదే పదే గైర్హాజరవుతుండటంతో న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసారు. దాంతో ఆమె తరుపు లాయిర్స్ బెయిల్ అడిగారు. 
 
కేసు వివరాల్లోకి వెళితే... 2018లో కోల్‌కతాలో జరిగిన దుర్గామాత పూజ కార్యక్రమంలో జరీన్ ఖాన్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.  రూ.12 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొని ఆ తర్వాత మొహం చాటేసింది.  ఆమె ముందుగా మాట్లాడుకున్నట్లు ఈ ప్రోగ్రామ్ చేయడానికి రాలేదు. దీంతో నిర్వాహకుల్లో ఒకరు జరీన్ తో పాటుగా ఆమె మేనేజర్‌ మోసం చేసినట్లు పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టారు. ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, విచారణకు హాజరుకావాలని కోరారు. కానీ నటి విచారణకు హాజరుకాలేదు. ఇదే కేసులో జరీన్ ఖాన్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. సెప్టెంబర్‌ నెలలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 

  అయితే ఖాన్ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత రూ.30,000 వ్యక్తిగత బాండ్‌పై డిసెంబర్ 26 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నామని, కోల్‌కతా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీలులేదని కోర్టు ఆంక్షలు విధించింది. జరీన్ ఖాన్ కోర్టు విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది.

ఈ విషయం మీద జరీన్ ఖాన్ ను ప్రశ్నించగా, నిర్వాహకులు తనను తప్పుదారి పట్టించారని తెలిపింది. బెంగాల్ ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తనకు చెప్పారని.. కానీ అది నార్త్ కోల్‌కతాలో జరిగిన ఒక చిన్న ఈవెంట్ అని తన టీం ద్వారా తెలుసుకున్నానని జరీన్ పేర్కొన్నారు. అంతేకాదు ఫ్లైట్ టిక్కెట్లు, వసతి వంటి విషయాల్లోనూ మిస్ కమ్యూనికేషన్ జరిగిందని.. అందుకే ఆ షో నుండి తప్పుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది.

గోపిచంద్‌ హీరోగా తెరకెక్కిన 'చాణక్య' చిత్రంతో జరీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇదే క్రమంలో తమిళం పంజాబీ చిత్రాల్లో కూడా అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంది. చివరగా 2021లో 'హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే' అనే హిందీ సినిమాలో నటించింది. 'ఈద్ హో జాయేగీ' మ్యూజిక్ వీడియోతో అలరించింది. 
 
2018లో నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో జరీన్ ఖాన్‌పై చీటింగ్ కేసు నమోదయ్యింది. కోల్‌కతాలో జరిగిన ఒక దుర్గా పూజ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు నటి దాదాపు రూ.12 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుంది. కానీ కార్యక్రమంలో ఆమె పాల్గొనలేదు. ఆగ్రహానికి గురైన నిర్వాహకులు జరీన్‌తోపాటు ఆమె మేనేజర్‌పై నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు పెట్టారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios