చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హీరో సుమంత్

court case against Actor sumanth over check bounce issue
Highlights

చిక్కుల్లో హీరో సుమంత్

ప్రముఖ హీరో నాగార్జున మేనల్లుడు, హీరో సుమంత్ చిక్కుల్లో పడ్డారు. ఆయన, ఆయన సోదరి సుప్రియ ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. సుమంత్ హీరోగా ఇటీవల ‘ నరుడా డోనరుడా’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ సినిమాతోనే సుమంత్ ఫామ్ లోకి వచ్చారు. ఈ సినిమాకి సుమంత్, ఆయన సోదరి సుప్రియలు నిర్మాతలుగా వ్యవహరించారు.

కాగా.. ఈ సినిమా సమయంలో సహనిర్మాతలకు వీరు చెక్ లు అందజేయగా.. అవి బౌన్స్ అయ్యాయి. దీంతో సహనిర్మాతలు వారిపై ప్రకాశం జిల్లా మార్కాపురంలో కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో గురువారం వీరిద్దరూ మార్కాపురం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. న్యాయమూర్తి పఠాన్‌ షియాజ్‌ ఖాన్‌ ఈ కేసును జూన్‌ 28కి వాయిదా వేశారు.

loader