Asianet News TeluguAsianet News Telugu

ధనుష్ పై హైకోర్టు ఆగ్రహం

 సామాన్య మానవుడు ఒక సోపు కొన్నా ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాడు.. ఇక కోట్లు సంపాదించే సినీ నటుడు ఎందుకు టాక్స్ పే చేయరని ప్రశ్నించింది.

Court admonishes Dhanush for tax exemption plea
Author
Chennai, First Published Aug 5, 2021, 5:28 PM IST

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తు వాహనాలకు పన్నులు చెల్లించేందుకు ప్రముఖులు మినహాయింపులు కోరుతుండడం, కొన్నిసార్లు పన్ను ఎగవేతకు పాల్పడుతుండడం తరచుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా తమిళ హీరో విజయ్ కూడా ఇలాంటి వ్యవహారంలోనే కోర్టుతో మొట్టికాయలు తిన్నాడు. తాజాగా మరో తమిళ హీరో ధనుష్ కూడా తన ఫారెన్ కారుకు పన్ను మినహాయింపు కోరి, హైకోర్టు ఆగ్రహానికి గురయ్యాడు.

ధనుష్ 2015లో విలాసవంతమైన రోల్స్ రాయిస్ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఆ లగ్జరీ కారుకు పన్ను మినహాయింపు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ధనుష్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ధనుష్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యులే పన్నులు కడుతున్నప్పుడు మీకేంటి ఇబ్బంది? అంటూ ప్రశ్నించింది. మీరు కొనుగోలు చేసింది లగ్జరీ కారు... పన్ను మినహాయించాలని ఎలా అడుగుతున్నారు? అంటూ నిలదీసింది.

ధనుష్ రోల్స్ రాయల్స్ కారు కొనుగోలు చేసిన విషయంలో దిగుమతి టాక్స్ రద్దు చేయాలనీ కోర్ట్ ని ఆశ్రయించాడు. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సామాన్య మానవుడు ఒక సోపు కొన్నా ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాడు.. ఇక కోట్లు సంపాదించే సినీ నటుడు ఎందుకు టాక్స్ పే చేయరని ప్రశ్నించింది. అంతేకాదు.. ఎంత ఖరీదైన కారు కొన్నా రోడ్డుమీదనేగా నడిపేది.. ఆకాశం లో కాదు అంటూ వ్యాఖ్యానించింది.

మధ్యతరగతి ప్రజలు మీలాగే టాక్స్ లనుండి మినహాయింపు కోరుతున్నారా… వీఐపీ హోదాలో ఉన్న వ్యక్తులు మాత్రం ఎందుకు టాక్స్ మినహాయింపు విషయాలలో కోర్ట్ ని ఆశ్రయిస్తున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇటువంటి పిటిషన్ వేయమని క్లయింట్ అడిగినప్పుడు న్యాయవాదులు .. పిటిషనర్ కి టాక్స్ ఎందుకు పే చేయాలో వివరించాల్సిన బాధ్యత లేదా అని జడ్జి ఎస్ ఎం సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో, ధనుష్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఇప్పటికే సగం పన్ను చెల్లించామని, మిగతా మొత్తాన్ని ఈ నెల 9న చెల్లిస్తామని కోర్టుకు వివరణ ఇచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios