Asianet News TeluguAsianet News Telugu

స్వలింగ సంపర్కం కోర్టు తీర్పు: ప్రముఖ దర్శకుడి కామెంట్!

స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 377ను రద్దు చేయడం ద్వారా లెస్బియన్, గే, బై సెక్సువల్ ట్రాన్స్ ‌జెండర్ హక్కులను కాపాడాలని పలువురు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు

Country Gets Oxygen Back karan johar tweet
Author
Hyderabad, First Published Sep 6, 2018, 3:27 PM IST

స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 377ను రద్దు చేయడం ద్వారా లెస్బియన్, గే, బై సెక్సువల్ ట్రాన్స్ ‌జెండర్ హక్కులను కాపాడాలని పలువురు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ]

వారి పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇవాళ తుది తీర్పును వెల్లడించింది. గే సెక్స్ నేరం కాదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా బాలీవుడ్ అగ్రదర్శకుడు కరణ్ జోహార్.. 'ఇది చారిత్రాత్మక తీర్పని, చాలా గర్వంగా ఉందని అన్నారు.

సమాన హక్కులకు, మానవత్వానికి భారీగా మద్దతు లభించిందని, దేశానికి మళ్లీ ఊపిరి లభించినట్లైందని.. సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. కరణ్ జోహార్ తో పాటు మరికొందరు సెలబ్రిటీలు సుప్రీం కోర్టు తీర్పుపై హర్షన్ వ్యక్తం చేస్తున్నారు. ఆమిర్ ఖాన్, దియా మీర్జా వంటి నటులు దేశాన్ని పొంగుతూ ట్వీట్ చేశారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios