Asianet News TeluguAsianet News Telugu

తొలిసారి ఆస్కార్ విన్నర్‌ భాను అతియా కన్నుమూత

ప్రముఖ పాపులర్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌, ఆస్కార్‌ విన్నర్  భాను అతియా(91)  కన్నుమూశారు. భారత్‌ నుంచి తొలిసారిగా ఆస్కార్‌ని అందుకున్న భారతీయురాలిగానూ  నిలిచిన ఆమె మరణంగా బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. 

costume designer and oscar winner bhanu   athiya no more arj
Author
Hyderabad, First Published Oct 15, 2020, 11:36 PM IST

ప్రముఖ పాపులర్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌, ఆస్కార్‌ విన్నర్  భాను అతియా(91)  కన్నుమూశారు. భారత్‌ నుంచి తొలిసారిగా ఆస్కార్‌ని అందుకున్న భారతీయురాలిగానూ నిలిచిన ఆమె మరణంగా బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబయిలోని స్వగృహంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. 

ఈ విషయాన్ని భాను అతియా కుమార్తె రాధిక గుప్తా వెల్లడించారు. గురువారం ఉదయం అమ్మ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎనిమిది ఏళ్ళ క్రితం మెదడులోఉ న్న కణితిని ఆపరేషన్‌ ద్వారా తొలగించారు. గత మూడేళ్లుగా ఆమె పెరాలసిస్‌తో మంచానికే పరిమితమయ్యారు` అని చెప్పారు. చివరకు గురువారం తెల్లవారు ఝామున నిద్రలోనే కన్నుమూసినట్టు ఆమె చెప్పారు. దక్షిణ ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో తమ తల్లి అంత్యక్రియలను  పూర్తి చేసినట్టు ప్రకటించారు.

1956లో బాలీవుడ్‌ లెజెండ్‌ గురుదత్‌ తెరకెక్కించిన `సీఐడీ` సినిమాతో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన భాను ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో వందకుపైగా చిత్రాలకు డిజైనర్‌గా పనిచేశారు. `పాయసా`, `చౌద్విన్ కా చాంద్`,  `సాహిబ్ బీబీ ఔర్ గులాం` తదితర గురుదత్ చిత్రాలకు పనిచేసి ఖ్యాతి గడించారు. `లేకిన్‌`, అమీర్‌ `లగాన్‌` చిత్రాలకు డిజైనర్‌గా పనిచేశారు. ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన విజయం సాధించిన `గాంధీ` చిత్రానికిగానూ ఆమె ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా 1982లో ఆస్కార్‌ని అందుకున్నారు. 

కొల్లాపూర్‌లో జన్మించిన అతియా.. ఈవ్స్ వీక్లీ సహా బొంబాయిలోని వివిధ మహిళా పత్రికలకు ఫ్రీలాన్స్ రచయితగా వృత్తిని ప్రారంభించారు. ఆ పత్రిక ఎడిటర్ రిక్వెస్ట్ మేరకు దుస్తులను డిజైన్ చేసిన భాను క్రమంగా తనలోని నైపుణ్యానికి పదును పెట్టి డిజైనర్‌గా మారారు. దాన్నే కెరీర్‌గా ఎంచుకున్నారు.

తనకు వచ్చిన ఆస్కార్ ని తిరిగి ఇచ్చారు. తన మరణం తర్వాత తన కుటుంబం ట్రోఫీని జాగ్రత్తగా చూసుకోలేదని భావించి తన అకాడమీ అవార్డును ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.15 డిసెంబర్ 2012 న, ట్రోఫీని  అకాడమీకి  తిరిగి ఇచ్చారు. అంతేకాదు `ది ఆర్ట్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్‌`  అనే పుస్తకాన్ని కూడా ఆమె రాశారు. భాను అతియా మరణం పట్ల బాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం  తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios