బాలీవుడ్ లో మరోసారి కరోనా కలకలం రేగింది. వరుసగా స్టార్స్ కరోనాబారిన పడుతున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్ కరోనా బారిన పడ్డారు.
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే రాజకీయ ప్రముఖులు కరోనాతో ఇబ్బందులు పడుతుండగా.. ఇప్పుడు ఫిల్మ్ సెలబ్రిటీస్ లో కూడా కరోనా కలకలం మొదలయ్యింది. వరుసగా బాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడుతున్నారు. వరుసగా షూటిగ్స్ జరుగుతుండటం.. సెలబ్రిటీలు కూడా ఏం జాగ్రత్తలు తీసుకోకుండా.. కరోనాను లైట్ తీసుకుని షూటింగ్స్ లో పాల్గోంటుండటంతో.. కరోనా మరోసారి ప్రతాపం చూపిస్తోంది.
బాలీవుడ్ లో కరోనా కలకలం రేగింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్ కరోనా బారిన పడ్డారు. వీరిద్దరికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గతంలో చాలా మంది సెలబ్రెటీలు కరోనా బారిన పడ్డారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బాలీవుడ్ బాద్ షా అభిమానులతో పాటు కత్రీనా అభిమానులు కూడా వారు త్వరగా కోలుకోవాలి అని పూజలు చేస్తున్నారు.
దేశంలో మళ్లీ కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అసలే ఎండలతో ఇబ్బంది పడుతున్న జానాలకు కరోనా మరోసారి భయపెట్టలా చేస్తోంది. దేశంలో కొత్తగా 4,270 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి 15 మంది మరణించారు. 2,619 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,31,76,817కి చేరింది.
ఇక ఇప్పటి వరకూ కరోనా నుంచి 4,26,28,073 మంది కోలుకున్నారు. 5,24,692 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. 24,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో కేరళలోనే 1,465 కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో... కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
