Asianet News TeluguAsianet News Telugu

వివాదంలో విశ్వంభర.. పోస్టర్ లో మెగాస్టార్ చేసిన పొరపాటు ఇదే..?

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. ఆయన తాజా మూవీ విశ్వంభర నుంచి అద్భుతమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. అయితే ఇప్పుడు ఆ పోస్టర్ సరికొత్త వివాదానికి దారి తీసింది.. ఇంతకీ ఈ పోస్టర్ లో దొర్లిన పొరపాటు ఏంటి..? 
 

Controversy Erupts Over Chiranjeevi Vishwambhara First Look Poster: Mistake Sparks Criticism JMS
Author
First Published Aug 23, 2024, 4:33 PM IST | Last Updated Aug 23, 2024, 4:33 PM IST

సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. గతంలో వరుస ఫెయిల్యూర్స్ ను చూసిన మెగా హీరో.. ఈసారి సినిమాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాడట. తాజాగా ఆయన యంగ్ డైరెక్టర్ వశిష్టతో విశ్వంభర సినిమాను చేస్తున్నారు. చాలా వరకూ కంప్లీట్ అయిన ఈసినిమా షూటింగ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈక్రమంలో ఈసినిమా నుంచి అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం రీసెంట్ గా అదిరిపోయే అప్ డేట్ ను ఇచ్చారు టీమ్. 

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా (అగస్ట్ 22) విశంభర సినిమా నుంచి చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. ఈ పోస్టర్ లో చిరంజీవి పవర్ ఫుల్ త్రిశూలాన్ని పట్టుకుని..ఏదో లోకంలోకి వెళ్తున్నట్టుగా కనిపించారు. విశ్వంభర టైటిల్ పోస్టర్ లుక్ చూసిన ఫ్యాన్స్ ఎంతో మురిసిపోయారు. ఈపోస్టర్ నుంచే సినిమాపై అంచనాలు పెంచేశారు. క్షణాల్లోనే చిరంజీవి పోస్టర్ వైరల్ అయ్యింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా ఉంది. 

చిరంజీవి విశ్వంభర పోస్ట్ వివాదానికి దారి తీసింది. ఈ పోస్టర్ లో ఒ పొరపాటు ఉండటంతో విమర్శలపాలు అవుతోంది. ఇందులో జరిగిన పొరపాటు ఏంటంటే.. శివుడి చేతిలో ఆయుధమైన త్రిశూలాన్ని చిరంజీవి చెప్పులు వేసుకుని పట్టుకున్నాడట. దాంతో కొంత మంది మనోబావాలను ఈరకంగా దెబ్బతీశారంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కాంట్రవర్సీకి దారి తీసింది. 

కొన్ని సినిమాలకు కాంట్రవర్సీలతోనే మంచి పబ్లిసిటీ వస్తుంది. ఈరకంగా విశ్వంభర సినిమాకు కాంట్రవర్సీ కలిసివచ్చి..హిట్ అవుతుందా..? లేక ఈ విషయంలొ సంజాయిషి ఇచ్చి తప్పును సరిచేసుకుంటారా..? అసలేంటి విషయం అనేది చూడాలి. ఇక ఈసినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన 20 ఏళ్ళ తరువాత త్రిష జంటగా నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి కానుకగా ఈమూవీని రిలీజ్ చేయబోతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios