నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. చాలా కాలం తర్వాత థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. 

ఈ చిత్రంలో సాయి పల్లవి, నాగ చైతన్య నటనపై ప్రశంసలు దక్కుతున్నాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల ఎప్పటిలాగే సెన్సిబుల్ సబ్జెక్టుతో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలోని ఓ సన్నివేశంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

సినిమాలో ఓ సన్నివేశంలో పూజ గదిలో లక్ష్మి దేవి చిత్ర పటం పక్కనే జీసెస్ ఫోటో కూడా ఉంటుంది. అన్ని మతాల ప్రేక్షకులని ఆకర్షించేందుకు శేఖర్ కమ్ముల ఇలాంటి ప్రయత్నం చేయడం సరికాదు అని హిందూ సంఘాలు అంటున్నాయి. హిందువుల పూజ గదుల్లో జీసెస్ ఫోటో ఎక్కడా ఉండదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదే ప్రయత్నాన్ని చర్చి, మసీదుల్లో చేయగలరా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఎక్కువగా సినిమాల్లో హిందూ దేవుళ్ళని కించపరచడం పరిపాటిగా మారిపోయిందని అంటున్నారు. ఇక సాయి పల్లవి రింగ్ సాయి బాబా రింగ్ టోన్ పెట్టుకుని కాల్ వచ్చిన ప్రతి సారి ఇరిటేట్ అవుతూ కనిపిస్తుంది. ఇలాంటివన్నీ సరికాదు అని హిందూ సంఘాలు అంటున్నాయి. ఆ సన్నివేశాలని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.