వివాదాస్పద బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ స్వామి ఓం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడిన ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం కన్నుమూసినట్టు అతని కుమారుడు అర్జున్ జైన్ వెల్లడించారు.
వివాదాస్పద బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ స్వామి ఓం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడిన ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం కన్నుమూసినట్టు అతని కుమారుడు అర్జున్ జైన్ వెల్లడించారు. ఢిల్లీలోని నిగమ్ బోధ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్టు చెప్పారు.
ఇదిలా ఉంటే స్వామి ఓం తనని తాను దేవుడిగా ప్రకటించకుని, రాజకీయ నాయకుడిగా చలామణి అయ్యారు స్వామి ఓం. ఆయన 2017లో హిందీలో ప్రసారమైన బిగ్‌బాస్ 10లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. తోటి కంటెస్టెంట్లపై మూత్ర విసర్జన చేసి వివాదాస్పదంగా మారాడు. ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడం, అతని చేష్టలు తోటివారిని ఇబ్బంది పెట్టేలా ఉండటంతో విసిగిపోయిన హోస్ట్ సల్మాన్ ఆయన్ని హౌజ్ నుంచి బహిష్కరించాడు.
అనంతరం ఆయన సల్మాన్‌పై అనేక ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ యాజమాన్యంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు ఇతర అనేక విషయాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్‌గా మారాడు. అంతేకాదు తనని తాను దేవుడిగా ప్రకటించుకుని షాక్ ఇచ్చాడు. గతంలో ఓ కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు.
