తనీష్ కోసం జుట్టు కత్తిరించుకున్న దీప్తి సునైనా

Contestents Sacrifices in Bigg Boss house
Highlights

తెలుగు బిగ్‌బాస్ 2 రోజు రోజుకు ఆశక్తిని రేకెత్తిస్తోంది. సోమవారం హౌస్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈసారి నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ నిర్వహించగా, ఎవరికి వారు అందులోంచి తప్పించుకునే మార్గాలను కూడా బిగ్ బాస్ సూచించాడు.

తెలుగు బిగ్‌బాస్ 2 రోజు రోజుకు ఆశక్తిని రేకెత్తిస్తోంది. సోమవారం హౌస్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈసారి నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ నిర్వహించగా, ఎవరికి వారు అందులోంచి తప్పించుకునే మార్గాలను కూడా బిగ్ బాస్ సూచించాడు. ఈ క్రమంలో ఊహించని టాస్క్‌లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎలిమినేషన్‌లో ఉన్నవారు దానిని తప్పించుకునేందుకు మరో వ్యక్తిని బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌కు అంగీకరించేలా చేయాలి. దాదాపు హౌస్ లోని అందరూ ఒకరి కోసం మరొకరు త్యాగం చేయగా దీప్తి కోసం ‌కౌశల్, భానుశ్రీ కోసం అమిత్ మాత్రం నిరాకరించారు. దీంతో దీప్తి, భానుశ్రీ నామినేషన్‌లోకి ఎంటరయ్యారు.

తొలుత తేజశ్వి కోసం సామ్రాట్ తనకిష్టమైన గడ్డం, మీసాలను తీసేందుకు అంగీకరించాడు. గణేశ్ కోసం బాబు గోగినేని రెండు కొత్తిమీర కట్టలు తిన్నారు. దీప్తి కోసం సీజన్ మొత్తం కౌశల్‌ తనను తాను నామినేట్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకు కౌశల్ నిరాకరించడంతో దీప్తి‌ ఎలిమినేషన్‌ లోకి వెళ్లిపోయింది. గీతామాధురి కోసం తేజశ్వి తనకు ఎంతో ఇష్టమైన దుప్పటిని ముక్కలుముక్కలుగా కట్ చేసింది. తనీష్ కోసం దీప్తి సునయన తన జుట్టును భుజాల వరకు కత్తిరించుకుంది. బాబు కోసం గీతామాధురి బిగ్ బాస్ టాటూను పర్మినెంట్‌‌గా వేయించుకుంది.

రోల్ రైడా కోసం గణేశ్ వారం మొత్తం కేవలం పండ్లు తినడంతోపాటు ఈ వారం తనకు తానుగా నామినేషన్‌కు ఓకే చెప్పాడు. అ‌మిత్ కోసం రోల్ రైడా తన జుట్టును కత్తిరించుకుని ఎర్రని రంగు వేసుకున్నాడు. భానుశ్రీ కోసం తన ‌తలకు కట్టుకున్న స్కార్ఫ్ ను తీసేయడంతోపాటు ఇక ఎప్పటికీ కెప్టెన్‌గా ఉండకూడదన్న టాస్క్‌కు ‌అమిత్ నిరాకరించడంతో భానుశ్రీ ఎలిమినేషన్ లోకి ఎంటరైంది. కాగా, బిగ్ బాస్ ఎలిమినేషన్ టాస్క్ కారణంగా హౌస్ లోని అందరూ ఒకరికొకరు దగ్గర కావడం విశేషం.

loader