'భరత్ అనే నేను'పై మండి పడుతున్నారు!

Complaint Filed Against Bharat Ane Nenu
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ 'భరత్ అనే నేను' సినిమా రూపొందించిన 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ 'భరత్ అనే నేను' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కొరటాల మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమాలో నవోదయం పార్టీ పేరుని ఆ పార్టీ జెండాను ఉపయోగించారు చిత్రబృందం.

ఎలెక్షన్ కమీషన్ రూల్స్ కు వ్యతిరేకంగా తన పార్టీ పేరుని ఎలా వినియోగిస్తారంటూ 'నవోదయం' పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ దాసరి రాము చిత్రబృందంపై మండిపడ్డారు. సినిమాలో నవోదయం ప్రెసిడెంట్ ఓ లంచగొండిగా, హత్యలు చేసే వాడిగా చూపించారని తమ పార్టీ మనోభావాలు దెబ్బ తీసే విధంగా సినిమా ఉందని విరుచుకుపడ్డారు. తాజాగా 'నవోదయం' పార్టీపై ఈ సినిమాలో తప్పుడు ప్రచారం చేశారని గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్ లో పార్టీ అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు.

నవోదయం పార్టీను 2010లో స్థాపించి కేంద్ర ఎన్నికల కమీషన్ తో రిజిస్టర్ చేయించామని అలాంటిది తమ పార్టీ పట్ల ప్రజల్లో ద్వేషం కలిగేలా ఈ సినిమాలో చూపించినట్లు ఆరోపించారు. తమ పార్టీకు వ్యతిరేకమైన కొన్ని మాటలను సినిమాలో చూపించారని కాబట్టి చిత్రబృందంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 
 

loader