Asianet News TeluguAsianet News Telugu

షారుఖ్ ఖాన్ ఇండియా టామ్ క్రూజ్ అన్న హాలీవుడ్ జర్నలిస్ట్... మండిపడుతున్న ఫ్యాన్స్

పాన్ ఇండియా  రేంజ్ లో రచ్చ రచ్చ చేస్తున్నాడు షారుఖ్ ఖాన్. దాదాపు ఏడేళ్ల తరువాత థియేటర్ లోకి వచ్చిన బాలీవుడ్ బాద్ షా.. రికార్డ్ లను బ్రేక్ చేస్తున్నాడు. 

Comparing Shahrukh With Tom Cruise Shahrukh  Fans Fires On Hollywood Journalist
Author
First Published Feb 4, 2023, 2:31 PM IST

 బాలీవుడ్ కు చాలా కాలం తరువాత కాస్త ఉపశమనం లభించింది.  చాలా రోజుల తర్వాత సక్సెస్ టేస్ట్ ను చవిచూసింది హిందీ పరిశ్రమ. షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది బాలీవుడ్. అటు షారుఖ్ ఖాన్ కూడా తన కెరీర్ అయిపోతోంది అనుకున్న టైమ్ లో.. దాదాపు 7 సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు.  పఠాన్ సినిమా అన్నిచోట్లా భారీ విజయం సాధించి ఇప్పటికే 696 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. 

ఈ సినిమాతో షారుఖ్ ఈజ్ బ్యాక్ అన్న నినాదాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ కి ఇండియాతో పాటు ఫారెన్ లో కూడా  భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ఇండియాలోనే కాకుండా ఇతర  దేశాల్లో కూడా పఠాన్ సినిమా భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ఇండియా తరువాత అమెరికాలో  పఠాన్ సినిమాకు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి.  ఇప్పటికే పఠాన్ సినిమా అమెరికాలో 15 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. 

పఠాన్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి అమెరికాకి చెందిన ఓ హాలీవుడ్ జర్నలిస్ట్ పఠాన్ సినిమా గురించి గొప్పగా రాశాడు. అంతే కాదు షారుఖ్ ఖాన్ గురించి కూడా  రాస్తూ.. ఇండియా టామ్ క్రూజ్ షారుఖ్ ఖాన్.. పఠాన్ సినిమాతో గత కొన్నాళ్లుగా విజయాలు లేని బాలీవుడ్ కి విజయం అందించాడు అని రాశాడు. అయితే  షారుఖ్ ని టామ్ క్రూజ్ తో పోల్చినందుకు షారుఖ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. షారుఖ్ ని ఎవ్వరితో పోల్చనవసరం లేదు, షారుఖ్ కి విదేశాల్లో కూడా గుర్తింపు ఉంది. కావాలంటే టామ్ క్రూజ్ ని షారుఖ్ తో పోల్చుకోండి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే ఈ వివాదం ముదిరి పాకాన పడుతుంది. కొంత మంది మాత్రం హాలీవుడ్ జర్నలిస్ట్ కు సపోర్ట్ పలుకుతున్నారు. ఇందులో తప్పేముంది మంచిగా పొగుడుతూనే రాశారు కదా.. దానికి ఇంతలా రియాక్ట్ అవ్వాలా అంటూ మండిపడుతున్నారు. ఇంత పొగరుగా ఆలోచించబట్టే బాలీవుడ్ పరిస్థితి అలా తయారయ్యిందంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios