Asianet News TeluguAsianet News Telugu

బిగ్‌ బాస్‌ కెప్టెన్‌గా కామన్‌ మ్యాన్‌.. అర్జున్‌ కి అంత లేదా శ్రీ సత్య నవ్వులో పరమార్థమేంటో?

ఏడు నిమిషాలు, ఆరు నిమిషాల కేటగిరిలో అర్జున్‌ తన అభిప్రాయాన్ని పంచుకోగా, ఆ సమయంలో శ్రీ సత్య లోలోపల ముసి ముసి నవ్వులు నవ్వుడం ఆశ్చర్యానికి గురిచేసింది. 

common man adi reddy won captain arjun went to jail sri satya expressions hot topic
Author
First Published Sep 23, 2022, 11:28 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 6 షో చప్పగా సాగుతుంది. నామినేషన్లతో హీటుపెంచిన బిగ్‌ బాస్‌, `అడవి దొంగ`లు టాస్క్ తో హౌజ్‌ని రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత మళ్లీ మొదటకొచ్చింది. శుక్రవారం ఎపిసోడ్‌(19వ రోజు) మరీ చప్పగా సాగింది. కెప్టెన్సీ టాస్క్ కూడా ఏమాత్రం కష్టం లేనిది ఇవ్వడంతో అది తేలిపోయింది. `ఎత్తర జెండా` టాస్క్ లో ఇసుకని కాడికి ఓ వైపు ఖాళీ బాక్స్ లో పోస్తే, మరోవైపు ఉన్న పైకి లేస్తుంది. అందులో వారి జెండా ఉంటుంది. ఎవరిదైతే ఫస్ట్ పైకి లేస్తుందో వాళ్లే విన్నర్‌. 

ఈ టాస్క్ లో నాల్గో వారం కెప్టెన్‌ కోసం ఆదిరెడ్డి, శ్రీహాన్‌, శ్రీ సత్య పోటీ పడగా, ఇందులో ఆదిరెడ్డి ఫాస్ట్ గా కంప్లీట్‌ చేసి కెప్టెన్‌గా గెలుపొందాడు. ఆ తర్వాత హైజ్‌లో రోజుకి గంటసేపు ప్రసారమయ్యే షోలో ఎవరు ఎక్కువగా కనిపిస్తారని భావిస్తున్నారనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఇందులో అత్యధికంగా పదినిమిషాల పాటు తాను కనిపిస్తానని భావిస్తున్న గీతూ రాయల్‌కి మొదటి స్థానంలో నిలిచారు. ఏడు నిమిషాలు కేటగిరిలో రేవంత్‌ ట్యాగ్‌ గెలుగుచుకున్నారు. 

ఏడు నిమిషాలు, ఆరు నిమిషాల కేటగిరిలో అర్జున్‌ తన అభిప్రాయాన్ని పంచుకోగా, ఆ సమయంలో శ్రీ సత్య లోలోపల ముసి ముసి నవ్వులు నవ్వుడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన దానికి అర్హుల కాడనే కోణంలో శ్రీ సత్య నవ్వినట్టుగా అనిపించింది. అయితే మొన్నటి వరకు ఈ ఇద్దరు కాస్త క్లోజ్‌ గా మూవ్‌ అయిన విషయం తెలిసిందే. కానీ వీరి మధ్య గ్యాప్‌ పెరుగుతుందని లేటెస్ట్  పరిణమాలతో తెలిసి పోతుంది. 

ఇక జీరో టైమింగ్‌ కోసం ముగ్గురు పోటీ పడ్డారు. కీర్తి, ఆరోహి, అర్జున్‌ పోటీ పడగా, ఈ ముగ్గురుచర్చించుకుని అర్జున్‌ని జైలుకి పంపించారు. అనంతరం హౌజ్‌లో డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. టాస్క్ లు పక్కన పెట్టి కంటెస్టెంట్ల మాటలకే ప్రయారిటీ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. వారు మాట్లాడుకునే అంశాలను హైలైట్‌గా చూపించారు. అయితే సాధ్యమైనంత వరకు అందరి మాటలలను చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో తనకు జీరో రావడం పట్ల కీర్త కన్నీళ్లు పెట్టుకుంది. 

మరోవైపు గీతూ దీనిపై మాట్లాడుతూ, జీరో కోసం పోటీ పడటం కాదు, దానికి మేం అర్హులం కాదంటూ వాదించాలని, ఫైట్‌ చేయాలని చెప్పడం విశేషం. వసంతి వద్దకు వెళ్లి రేవంత్‌ తాను పది నిమిషాలకు అర్హుడినా, ఏడు నిమిషాలకు అంటే ఆమె ఏడు నిమిషాలకే అని చెప్పింది. అలాగే, గీతూ, ఆదిరెడ్డి, ఫైమాల మధ్య ఇలాంటి చర్చే జరిగింది. ఇంకోవైపు ఆరోహి, ఆర్ జే సూర్య ఫుడ్‌ కోసం దొంగతనం చేయడం, చాటుగా వంట చేసుకుని తినడం కాస్త సిల్లిగా అనిపించింది. వారిద్దరి మధ్య వచ్చే ఇతర సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. చివర్లో చంటి కామెడీ పంచ్‌లు మరింత నవ్వించాయి. మొత్తంగా శుక్రవారం ఎపిసోడ్‌ చాలా సోదీగా సాగిందని అంటున్నారు నెటిజన్లు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios