కమెడియన్స్ ని లీడ్ రోల్ లో పెట్టి సినిమాలు తెరకెక్కించడం కొత్తేమీ కాదు. అలీ, సునీల్, బ్రహ్మానందం, తమిళంలో సంతానం హీరోలుగా పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం నటుడు యోగిబాబు సౌత్ లో కమెడియన్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

కమెడియన్స్ ని లీడ్ రోల్ లో పెట్టి సినిమాలు తెరకెక్కించడం కొత్తేమీ కాదు. అలీ, సునీల్, బ్రహ్మానందం, తమిళంలో సంతానం హీరోలుగా పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం నటుడు యోగిబాబు సౌత్ లో కమెడియన్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లక్కీ మాన్. సెప్టెంబర్ 1న తమిళంలో రిలీజ్ అవుతోంది. 

బాలాజీ వేణుగోపాల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రేపు రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ నేడు చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఒక ఆసక్తికర విషయంపై దర్శకుడు వేణుగోపాల్, యోగిబాబు ఇద్దరూ షాకింగ్ కామెంట్స్ చేశారు. యోగిబాబు ఇండియన్ నటుడు అంటూ ప్రశంసలు కురిపించారు. అలాంటి నటుడిపై కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని వేణుగోపాల్ అన్నారు. 

తన కుటుంబ సభ్యులకు మెడికల్ ఎమెర్జన్సీ ఉన్నప్పటికీ యోగిబాబు ఆ కష్టాన్ని దిగమింగుతూ షూటింగ్స్ కి హాజరైన సందర్భాలు ఉన్నాయని వేణుగోపాల్ అన్నారు. నిర్మాతలకు నష్టం జరగకూడదు అని భావించే నటుడు యోగిబాబు అంటూ దర్శకుడు వేణుగోపాల్ ప్రశంసించారు. 

యోగిబాబు మాట్లాడుతూ ఈ చిత్రం కోసం తనకు అవకాశం కల్పించిన దర్శకుడు వేణుగోపాల్ కి కృతజ్ఞతలు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలకు యోగిబాబు ధీటుగా సమాధానం ఇచ్చాడు. నేను గతంలో కొన్ని చిత్రాల్లో కేవలం నాలుగైదు సన్నివేశాల్లోనే నటించిన చిత్రాలు ఉన్నాయి. ఆ సన్నివేశాలని చూపించి నిర్మాతలు నా పేరు వాడుకుంటూ విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. 

ఇది ప్రేక్షకులని మోసం చేయడం లాంటిదే. నేను చెప్పుకోదగ్గ సన్నివేశాల్లో నటించినప్పుడు అలా ప్రచారం చేసుకోవచ్చు. కానీ నాలుగైదు సన్నివేశాల్లో నటించిన చిత్రాలనికూడా యోగిబాబు సినిమా అంటూ చెప్పుకుంటున్నారు. దీని గురించి ప్రశించినప్పుడే నాకు సమస్యలు ఎదురవుతున్నాయి. నాపై వచ్చిన ఆరోపణలు.. దీని గురించి ప్రశ్నించిన పుణ్యమే అని యోగిబాబు అన్నారు. నేను షూటింగ్స్ కి ఎందుకు డుమ్మా కొడతాను ? షూటింగ్స్ చేయకుండా నేనేం చేస్తాను అని ప్రశ్నించారు.