Asianet News TeluguAsianet News Telugu

జనసేన తరపున అక్కడి నుంచి పోటీ చేస్తా, 44వేల మంది మావాళ్లే.. ఆసక్తి రేపుతున్న కమెడియన్ పృథ్వీ కామెంట్స్

30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కమెడియన్ గా పృథ్వీ బాగా పాపులర్ అయ్యారు. పలు చిత్రాల్లో ఆయన పోషించిన కామెడీ రోల్స్ బాగా నవ్వించాయి. 2019 ఎన్నికల సమయంలో పృథ్వీ వైసీపీ పార్టీలో చేరి పెద్ద హంగామానే చేసారు.

Comedian Prudhviraj interesting on contesting as MLA in Janasena
Author
First Published Mar 25, 2023, 5:57 PM IST

30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కమెడియన్ గా పృథ్వీ బాగా పాపులర్ అయ్యారు. పలు చిత్రాల్లో ఆయన పోషించిన కామెడీ రోల్స్ బాగా నవ్వించాయి. 2019 ఎన్నికల సమయంలో పృథ్వీ వైసీపీ పార్టీలో చేరి పెద్ద హంగామానే చేసారు. ప్రచారం కోసం రాష్ట్రం మొత్తం తిరిగారు. ఫలితంగా సీఎం జగన్ పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. 

కానీ మహిళతో పృథ్వి జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడం, లైంగిక పరమైన వివాదంలో పృథ్వీ చిక్కుకోవడం అతడికి సమస్యలు తెచ్చిపెట్టింది. చైర్మన్ పదవిని కుఆ పృథ్వీ కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో పృథ్వీ జనసేన పార్టీకి మద్దతుదారుడిగా మారారు. మెగా బ్రదర్ నాగబాబు పృథ్వికి అండగా నిలుస్తున్నారు. 

తాజాగా ఇంటర్వ్యూలో పృథ్వీ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. 2024లో జరగబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా జనసేన నుంచి పోటీ చేయడానికి సిద్ధం అని పృథ్వీ ప్రకటించారు. కాకపోతే తన సొంత ఊరు తాడేపల్లి గూడెం నుంచి కాకుండా చోడవరం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పృథ్వీ తెలిపారు. వైజాగ్ చుట్టుపక్కల మాకు బంధువులు ఎక్కువగా ఉన్నారు. 

చోడవరంలో అయితే మా ఇంటిపేరు బలిరెడ్డి వారు చాలా మంది ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో బలిరెడ్డి సత్యారావు ఎమ్మెల్యే గా పనిచేశారు. ఆయన నాకు తాతగారి వరుస అవుతారు. మొత్తంగా చోడవరం నియోజకవర్గంలో 44 వేల మంది మావాళ్లే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తా అని పృథ్వీ అన్నారు. 

ఇక సొంత ఊరు తాడేపల్లిగూడెం ఎందుకు వద్దంటే.. అక్కడ ఆల్రెడీ బలమైన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. కాబట్టి ఆ నియోజకవర్గంలో తాను పోటీ చేయాల్సిన అవసరం లేదని పృథ్వీ తెలిపారు. పృథ్వీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పృథ్వీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం పక్కన పెడితే అతడి కాన్ఫిడెన్స్ మాములుగా లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios