కమెడియన్ గా టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన పృధ్వీ రాజకీయాల పరంగా కూడా చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఓ పక్క సినిమాలు, మరోపక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పనులతో బిజీగా గడుపుతున్న ఈ నటుడు తాజాగా కమ్మ సామాజిక వర్గంపై సంచనల వ్యాఖ్యలు చేశారు.

సినీ రంగంలో ఉండి ఇక్కడ బలమైన సామాజిక వర్గాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారా..? అని పృధ్వీని ప్రశ్నించగా.. 'సామాజిక వర్గం అంటూ ఎందుకు దాస్తారు.. కమ్మవాళ్లే కదా.. నేను ఇలాంవిటి పట్టించుకోను.. కమ్మవారు మాత్రం మనుషులు కాదా.. వారేమైనా దిగొచ్చారా..' అంటూ కామెంట్ చేశారు.

తన స్నేహితుల్లో కూడా చాలా మంది కమ్మ వర్గానికి చెందిన వారు ఉన్నారని.. వాళ్లు మనుషులు కాదా అని ప్రశ్నించారు. అన్నీ బలమైన సామాజిక వర్గాలే.. ఏది కాదూ అంటూ ప్రశ్నించారు. కుల, మతాలకు భయపడే మనిషిని కాదని.. జనం కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు.