తెలిసి కూడా ఆమె గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్లింది? : నటుడు పృధ్వీ

First Published 30, Jun 2018, 1:25 PM IST
comedian prudhvi comments on casting couch in tollywood
Highlights

ఆ ప్రొడ్యూసర్ గురించి తెలిసి ఆమె గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్లింది

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి ఏవోక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు తారలు టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని అంటుంటే మరికొందరు మాత్రం లేదని వాదిస్తున్నారు. తాజాగా నటుడు పృధ్వీ కూడా ఈ విషయంపై స్పందించారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది కారణంగా టాలీవుడ్ పరువు పోతుందని అన్నారు.

''సినిమా కోసం నిర్మాత కొన్ని కోట్లు ఖర్చు చేస్తారు.. అలాంటిది కథకు సరిపోయే హీరోయిన్ ను మాత్రమే ఆయన తీసుకుంటారు. మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ లాంటి అమ్మాయిని కథకు సెట్ అవుతుందనే తీసుకొచ్చారు. ఇక్కడున్న వాళ్లతో ఆ పాత్ర చేయించలేమని అన్నారు. కొన్నేళ్ల కిందటి వరకు తెలుగు అమ్మాయిలే హీరోయిన్లుగా రాణించారు. ఇప్పుడు టాప్ హీరోల సరసన సరిపోయే తెలుగు అమ్మాయిలను చూపించండి'' అంటూ ఎదురు ప్రశ్నించారు.

అలానే సినిమా ఇండస్ట్రీ పరువు పోయేలా కొందరు ఆర్టిస్టులు వ్యవహరిస్తుండడం బాధాకరమని అన్నారు. ఓ సినీ నిర్మాత గురించి గతంలో  ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది.. ఆమెను ఉద్దేశిస్తూ పృధ్వీ ప్రొడ్యూసర్ గురించి తెలిసి కూడా ఆమె గెస్ట్ హౌస్ కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. ఇలా కొందరు చేస్తోన్న కామెంట్ల కారణంగా జనాల్లో సినిమా వాళ్లంటే చులకన భావం ఏర్పడిందని అన్నారు. 
 

loader