బిగ్ బాస్ సీజన్ 3లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంట్లో ఉన్న సభ్యులు వాళ్లలో వాళ్లే చూసుకునేలా నామినేషన్ ప్రక్రియని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ న్యూస్ యాంకర్ జాఫర్, యూట్యూబ్ తో పాపులర్ అయిన కమెడియన్ మహేష్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. 

మొదటి జాఫర్ నామినేట్ అయ్యాడు. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ప్రకారం జాఫర్ తన ప్లేస్ లోకి మహేష్ ని నామినేట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ మోనిటర్ గా వ్యవహరించిన హేమ మహేష్ కే మద్దతు తెలిపి జాఫర్ నే నామినేషన్ లో కొనసాగేలా చేసింది. తాను మహేష్ పేరు చెప్పడానికి జాఫర్ ఓ కారణం చెప్పాడు. 

తాను మహేష్ కంటే బెటర్ గా గేమ్ అడగలనని జాఫర్ తెలిపాడు. అందుకే మహేష్ పేరు చెప్పినట్లు తెలిపాడు. జాఫర్ వ్యాఖ్యలకు మహేష్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. నా కంటే ఆయన బెటర్ అంటున్నారు.. నేను హౌస్ లో ఉంటే ఏమేమి చేయగలనో చెబుతా.. యువకుడిని కాబట్టి ఫిజికల్ గేమ్ ఏది వచ్చినా తట్టుకుని నిలబడతా. ఎక్కువగా ఎమోషన్ కు గురికాను. 

నేను యాక్టింగ్ కామెడీగా చేస్తాను కానీ కామెడీ పీస్ అయితే కాదు. నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం ధూమ్ ధామ్ అయిపోద్ది అంటూ మహేష్ కౌంటర్ ఇచ్చాడు. శ్రీముఖి, హిమజ మధ్య కూడా వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.