నా డైలాగ్ కి పవన్ తెగ నవ్వారు.. కమెడియన్ మహేష్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 3, Sep 2018, 11:27 AM IST
comedian mahesh about pawan kalyan
Highlights

'జబర్దస్త్' షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ మహేష్ ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు రావడంతో నటుడిగా బిజీ అయ్యాడు. 'రంగస్థలం' సినిమాలో హీరో పక్కనే ఉంటూ కామెడీ చేసే క్యారెక్టర్ లో కనిపించాడు మహేష్. 

'జబర్దస్త్' షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ మహేష్ ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు రావడంతో నటుడిగా బిజీ అయ్యాడు. 'రంగస్థలం' సినిమాలో హీరో పక్కనే ఉంటూ కామెడీ చేసే క్యారెక్టర్ లో కనిపించాడు మహేష్. ఈ సినిమాతో నటుడిగా అతడికి మంచి గుర్తింపు లభించింది.

ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నాకొక పాత్ర ఇవ్వండి సార్.. అంటూ సుకుమార్ గారిని చాలా సార్లు అడిగాను. ఆయన గుర్తుపెట్టుకొని మరీ 'రంగస్థలం' సినిమాలో అవకాశం ఇచ్చారు. హీరోతో పాటు సినిమా మొత్తం ఉండే పాత్ర చేయడం ఇదే మొదటిసారి. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా పండించే పాత్రలో నన్ను తీసుకొని నాకు గుర్తింపు వచ్చేలా చేసిన ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్ గారికే దక్కుతుంది.

షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవి గారు వచ్చి.. ఈ సినిమాతో నీకు చాలా గుర్తింపు వస్తుందయ్యా.. అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా చూస్తున్నప్పుడు.. 'ఏమో గురుగారు ఆ ఎత్తులు,పల్లాలు మీకే తెలియాలి.. ఓసారి చూశారుగా' అని నేను చెప్పిన డైలాగ్ కి తెగ నవ్వారు. ఆయన వెనుకే కూర్చున్న నేను చాలా ఆనందపడ్డాను'' అంటూ చెప్పుకొచ్చాడు. 

loader