కరోనా విలయం మరింతగా విజృంభిస్తోంది. అది అనేక మందిని బలితీసుకుంటుంది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కార్పొరేట్లు, సాధారణ ప్రజలు అనే తేడా లేకుండా ఇప్పటికే లక్షల మందిని బలితీసుకుంది. సినీ సెలబ్రిటీలు చాలా మంది కరోనాతో కన్నమూశారు. తాజాగా కమెడీయన్‌ గౌతం రాజు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సిద్ధార్థ కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనాకి గురైన ఆయన కాకినాడలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 

గౌతంరాజు సోదరుడు సిద్ధార్థకి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తన సోదరుడు మరణ వార్తని గౌతంరాజు పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ద్వారా వెల్లడించారు. తమ ఇంట్లో నెలకొన్న విషాదాన్ని తెలియజేస్తూ ఎమోషనల్‌ అయ్యారు. బయట పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని, అందరు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. దీంతో గౌతంరాజు సోదరుడి మృతి  పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గౌతంరాజు నటుడిగా, కమెడీయన్‌గా అనేక చిత్రాల్లో నటించి మెప్పిస్తున్నారు.