కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్‌ బ్రహ్మానందం నటించని సినిమా అంటే భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. కానీ ఇప్పుడు సీన్‌ వేరు. బ్రహ్మానందం ఓ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో నటించి చాలా కాలమే అవుతుంది. కొద్ది రోజులు క్రితం ఆరోగ్య సమస్యలు రావటంతో బ్రహ్మానందం సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్నాడు. ఆరోగ్యం కుదుట  పడిన తరువాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా పూర్తి స్థాయి పాత్రలో మాత్రం కనిపించలేదు.

ఈ నేపథ్యంలో బ్రహ్మానందం సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బ్రహ్మానందం వెండితెరకు గుడ్‌ బై చెప్ప బోతున్నారన్న వార్త మీడియాలో వైరల్‌ అవుతోంది. అదే సమయంలో బ్రహ్మీ బుల్లితెర వైపు చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. టెలివిజయ్‌ షోస్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించేందుకు బ్రహ్మానందం ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఆరోగ్యం సహకరించకపోవటంతో పాటు కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే బ్రహ్మీ ఈ నిర్ణయం తీసుకున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే బ్రహ్మానందం డైలీ సీరియల్‌లో నటించేందుకు అంగీకరించాడని వార్తలు కూడా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. బ్రహ్మీనే లీడ్‌ రోల్‌ పలువురు సీరియల్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.