లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్ గురించి ఓ న్యూస్ టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. రాజా గౌతమ్ సంపాదన ఇన్ని కోట్లు అంటూ కథనాలు వెలువడుతున్నాయి.   

ఎప్పుడో 2004లో బ్రహ్మానందం తన పెద్ద కొడుకు రాజా గౌతమ్ ని హీరోగా పరిచయం చేశాడు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పల్లకిలో పెళ్లి కూతురు రాజా గౌతమ్ డెబ్యూ మూవీ. మ్యూజికల్ హిట్ గా నిలిచిన పల్లకిలో పెళ్లి కూతురు పర్లేదు అనిపించుకుంది. భారీ లాంచ్ తర్వాత రాజా గౌతమ్ ఒకటి రెండు చిత్రాల్లో నటించారు. అయినా ఆయనకు బ్రేక్ రాలేదు. నటుడిగా ప్రయత్నాలు ఆపలేదు. 

అయితే నటన కేవలం ఫ్యాషన్ మాత్రమే అట. రాజా గౌతమ్ బిజినెస్ మాన్ గా సూపర్ సక్సెస్ అట. అతడికి పలు వ్యాపారాలు ఉన్నాయి. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ చేసిన రాజా గౌతమ్ పలు ఎమ్ఎంసీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడట. బెంగుళూరులో రెస్టారెంట్స్ ఉన్నాయట. కమర్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నాయట. పలు వ్యాపారాల ద్వారా రాజా గౌతమ్ నెలకు రూ. 30 కోట్లు వరకూ సంపాదిస్తాడట. అంటే రోజుకు కోటి రూపాయలు అతడు సంపాదిస్తున్నాడు. 

మరి బడా బడా పాన్ ఇండియా స్టార్స్ కూడా అంత సంపాదించడం లేదు. సంపాదన విషయంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ ని రాజా గౌతమ్ మించిపోయాడు. బ్రహ్మానందం నటుడిగా కోట్లు సంపాదించారు. మూడు దశాబ్దాలకు పైగా సాగిన నట ప్రస్థానంలో ఆయన తీరిక లేకుండా నటించారు. ఇక సంపాదించిన ప్రతి రూపాయి జాగ్రత్త చేశారు. బ్రహ్మానందం డబ్బులు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారట. ఎడాపెడా ఖర్చు చేయడం, ఆర్భాటాల కోసం దానాలు చేయడం ఆయనకు నచ్చదు. 

బ్రహ్మానందంకి వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఆ సంపదను రాజా గౌతమ్ వ్యాపారాల వైపు మళ్ళించాడు. బ్రహ్మానందం చిన్న కొడుకు గురించి తెలిసింది తక్కువే. ఇటీవల అతడికి నిశ్చితార్థం జరిగింది. అతడు విదేశాల్లో ఉద్యోగం చేస్తాడని సమాచారం.