సారాంశం

ప్రముఖ హాలీవుడ్ నటుడు స్టార్ కమెడియన్  రస్సెల్ బ్రాండ్‌పై 'రేప్, లైంగిక వేధింపులు మరియు సెక్సువల్ వేదింపులఆరోపణలు వచ్చాయి, లండన్‌లోని ది సండే టైమ్స్ ప్రకారం. అతను 2006 మరియు 2013 మధ్య కాలంలో స్టార్ కమెడియన్ గా ఉన్నాడు. 

ప్రముఖ హాలీవుడ్ నటుడు స్టార్ కమెడియన్  రస్సెల్ బ్రాండ్‌పై 'రేప్, లైంగిక వేధింపులు మరియు సెక్సువల్ వేదింపులఆరోపణలు వచ్చాయి, లండన్‌లోని ది సండే టైమ్స్ ప్రకారం. అతను 2006 మరియు 2013 మధ్య కాలంలో స్టార్ కమెడియన్ గా ఉన్నాడు. ఇక అతను  నలుగురు మహిళలపై అత్యాచారం మరియు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించబడ్డాడు. అంతే కాదు ఆ నలుగురు మహిళలలో 16 సంవత్సరాల బాలిక కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అతనిపై తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 

MTV U.K.లో  స్టార్ హోస్ట్‌గా పేరు తెచ్చుకున్న బ్రిటీష్ హాస్యనటుడు రస్సెల్.  హాలీవుడ్  లో ఫర్‌గేటింగ్ సారా మార్షల్' మరియు 'గెట్ హిమ్ టు ది గ్రీక్'లో లాంటి ఫేమస్ సినిమాల్లో నటించారు. అతను 2010 లో  గాయని కాటి పెర్రీని వివాహం చేసుకున్నాడు. కాని ఆమెతో విభేదాలు వచ్చి  2012 లో విడిపోయారు. ఇక మీడియా నివేదికల ప్రకారం, 2012లో లాస్ ఏంజిల్స్‌లోని తన ఇంటిలో గోడకు ఆనుకుని రస్సెల్ తనపై అత్యాచారం చేశాడని నలుగురు  మహిళల్లో ఒకరు ఆరోపిస్తున్నారు. 

అంతే కాదు ఆ సమయంలో ఆమె వయసు ముప్పై ఏళ్లు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పాలంటూ మెసేజ్‌లు పంపినట్లు ఆమెగుర్తు చేసుకున్నారు. అంతే కాదు ఆ ఆరోపణలకు సబంధించిన స్క్రీన్ షాట్ లు, టెక్స్ట్ మెసేజ్ లు.. సండే టైమ్స్‌లో ప్రచురించబడ్డాయి. అంతే కాదు టైమ్స్ నివేదిక ప్రకారం రస్సెల్  16 సంవత్సరాల వయస్సులో మరో అమ్మాయిపై దాదాపుగా  మూడు నెలలు  లైంగిక వేధింపులకు పాల్పడినట్టు  వార్తలు వైరల్ అయ్యాయి. 

అంతే కాదు ఆ 16 ఏళ్ల అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడినప్పుడు అతని వయస్సు 30 ఏళ్లు. ఒక సంఘటనలో, అతను ఆ మహిళతో.. ధారుణంగా ప్రవర్తించాడని.. బలవంతంగా అసజ శృంగారానికి పాల్పడ్డాడని అలా రకరకాలుగా తమను బాధపెట్టాడని. ఇబ్బందులకు గురి చేశాడంటై.. ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు రస్పెల్. 2013లో తన  ఇంట్లో హాస్యనటుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మరో బాధితురాలు వెల్లడించింది. ఈ ఘటన గురించి ఎప్పుడైనా బహిరంగంగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించాడు.

అంతే కాదు మరొక సంఘటనలో, 24 ఏళ్ల రన్నర్ తన డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు బ్రాండ్ ఒకసారి గా వెనుకనుంచి వచ్చి.. బలవంతంగా తనను అనుభవించాడంటూ పేర్కోంది. అంతే కాదు.. అతను ఆమెను  ఓరల్ సెక్స్  చేయడానికి ఉసిగోలిపినట్టు  ఆరోపణ చేసింది. అంతే కాదు తను అమ్మాయిలతో దగ్గరగా ఉన్న సమయంలో ఫోటోలను తీసి స్నేహితులతో పంచుకున్నాడని తన స్నేహితుల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. 

ఇదిలా ఉంటే, సో, దిస్ ఈజ్ హ్యాపెనింగ్' అనే యూట్యూబ్ వీడియోలో బ్రాండ్ ఆరోపణలను ఖండించింది. వీడియోలో, బ్రాండ్ ఈ విషయాలను  పూర్తిగా ఖండించాడు. తనపై వచ్చే ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని సమర్ధించుకునే ప్రయత్నంచేశాడు. తనపై కావాలనే ఇలా ప్రచారం జరుగుతందంటూ.. తనను తాను నిర్ధోషిగా నిరూపింకునే ప్రయత్నం చేశాడు. కాని రస్సెల్ బ్రాండ్ తన కెరీర్‌లో అనేక వివాదాలను ఎదుర్కొన్నాడు.. ఇప్పటికీ ఎదరుక్కొంటూనే ఉన్నాడు.