కమెడియన్ అలీ, మెగా బ్రదర్ నాగబాబు ఇద్దరూ ఇటీవల ముగిసిన ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా నిలిచినవాళ్ళే. నాగబాబు జనసేన తరుపున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అలీ వైసిపిలో చేరి ఆ పార్టీ తరుపున ప్రచారం నిర్వహించారు. తాజాగా వీరిద్దరి గురించి ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఎన్నికలు ప్రారంభమైన తర్వాత జబర్దస్త్ షోకు దూరమయ్యారు. జనసేన తరుపున ప్రచారం నిర్వహించడం కోసం నాగబాబు జబర్దస్త్ కు తాత్కాలికంగా దూరమయ్యారు. 

రాజకీయాల్లో బిజీ అయినా జబర్దస్త్ ని మాత్రం విడిచిపెట్టనని నాగబాబు గతంలో తెలిపారు. ఇప్పటికి జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల నాగబాబు జబర్దస్త్ షోలో పాల్గొనడం లేదు. దీనితో నాగబాబు స్థానంలో ప్రముఖ కమెడియన్ అలీ జబర్దస్త్ షోలో జడ్జ్ గా పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

కానీ అలీ కొన్ని వారాల పాటు మాత్రమే జబర్దస్త్ షోలో పాల్గొంటాడట. నాగబాబు వచ్చే వరకు అలీ జబర్దస్త్ షో కు హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి రోజా, నాగబాబు న్యాయనిర్ణేతలుగా కొనసాగుతున్నారు.